పాఠకులు గ్రంధాలయాన్నీ వినియోగించుకోవాలి

Readers should use all libraries– భూపాలపల్లి డీపీఓ నారాయణ రావు

నవతెలంగాణ – మల్హర్ రావు
పాఠకులు గ్రంధాలయాన్ని వినియోగించుకోవాలని భూపాలపల్లి జిల్లా పంచాయతీ అధికారి నారాయణ రావు సూచించారు. మంగళవారం మండలంలోని రుద్రారం, కొయ్యుర్ గ్రామాల్లోని  గ్రంథాలయాలను డీపీఓ సందర్షించి పరిశీలించారు.ఈ సందర్భంగా గ్రంథాలయం ఎలా వినియోగించుకోవాలనే దానిపై పలు సూచనలు సలహాలు చేశారు.త్వరలో పూర్తిస్థాయిలో వాడకంలోకి తీసుకరానున్నట్టుగా తెలిపారు. అనంతరం కొయ్యుర్ గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ నిర్వహించారు.ప్రభుత్వం చిన్నారులకు అందించే పోషకాహారాలు అందేలా చూడాలని, అంగన్వాడీ సిబ్బందిని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయం అధికారి టి..శ్రీలత,డిఎల్పీఓ వీర భద్రయ్య పంచాయతీ కార్యదర్శి ఎం.భాస్కర్ రెడ్డి,తాడిచెర్ల గ్రంధాలయం పార్ట్ టైం వర్కర్ చల్లా ప్రభాకర్, అంగన్ వాడి సిబ్బంది పాల్గొన్నారు.