లారీ హల్స్ అండర్ సన్ చెప్పినట్లు… ”పాఠశాల గ్రంథాలయాలు సంస్కతికి పునాదులు- విలాసాలకు కాదు”. ఒక జాతి చరిత్రను, సంస్కతిని నిక్షిప్తం చేసి భవిష్యత్ తరాలకు అందజేసే విజ్ఞాన నిధులు పాఠశాల గ్రంథాలయాలు. అలా దేశవ్యాప్తంగా పాఠశాల గ్రంథాలయాల గమనాన్ని పరిశీలిస్తే… కేరళ, కర్ణాటక, ఢిల్లీ రాష్ట్రాల పాఠశాల గ్రంథాలయాలు విద్యార్థులకు జ్ఞానాన్ని అందించడంలో చక్కని పాత్ర పోషిస్తున్నాయి.
దక్షిణాది రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక విద్యావ్యవస్థలో అధునాతన సౌకర్యాలు కల్పిస్తున్నప్పటికీ తెలంగాణ రాష్ట్రంతో పోల్చితే పాఠశాల (గురుకుల పాఠశాలలో బీసీ గురుకులాలు, ఎస్సీ గురుకులాలు, మైనార్టీ గురుకులాలు, గిరిజన గురుకులాలలో పాఠశాలల్లో, కళాశాలలో చక్కటి గ్రంథాలయాలు ఏర్పాటు చేసింది) గ్రంథాలయాల ఏర్పాటులో వెనుకబడి ఉన్నది. ఒకప్పటి కర్ణాటక రాష్ట్రంలో పాఠశాల గ్రంథాలయాలు అత్యధికంగా ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఐదువేల పాఠశాల గ్రంథాలయాలకు రూపకల్పన చేయడం ఆహ్వానించదగ్గ విషయం.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఉత్తమమైన గుణాత్మక, సజనాత్మకమైన విద్యను అందించి, వారిని విజ్ఞాన వంతులుగా, విచక్షణ, వివేచన, బాధ్యత గల పౌరులుగా తీర్చిదిద్ది వారి భవిష్యత్‌కు బాటలు వేసేలా పాలితులు సంకల్పించాలి.
అనేక ప్రభుత్వ పాఠశాలల్లో ప్రైవేటు పాఠశాలల్లో గత రెండు దశాబ్దాలుగా అనుకున్నంత స్థాయిలో నాణ్యమైన విద్యను అందించడంలో విద్యాసంస్థలు విఫలమవుతున్నాయి దానికి కారణాలు అనేకం ఉండవచ్చు. అంతెందుకు 2020- 21, 2021-22 విద్యా సంవత్సరాల కాలం కరోనా ఉపద్రవానికి బలయ్యాయి. ఇలా అనేక కారణాలు ఉన్నాయి. పెద్ద తరగతుల్లో ప్రవేశించిన అనేక మంది విద్యార్థులకు కనీసం చదవడం (రీడింగ్), రాయడం (రైటింగ్) రాకపోవడం, కనీసం లెక్కలు, సామాజిక అవగాహన లేకపోవడం ఇబ్బంది కలిగించే విషయం. ఇది ప్రభుత్వ, ప్రైవేటు రెండు విద్యాసంస్థల్లోనూ ఉండడం గమనార్హం.
హొనేషనల్ అచీవ్మెంట్ సర్వే, ఎసర్, మార్గ్ సర్వే 2022, గతంలో వెల్లడించిన విషయం ఏమంటే చాలా ప్రభుత్వ పాఠశాలల్లో హైస్కూల్ తరగతుల్లోకి వచ్చిన విద్యార్థులకు సైతం తెలుగు, ఆంగ్లం చదవడం, రాయడం, గణితం వంటి అంశాల్లో వెనుకబడి ఉన్నారని. దీంతో విద్యాశాఖ ఈ అంశాలలో నాణ్యతను పెంచేందుకు 2017కు ముందు త్రీ ఆర్స్ (చదవడం, రాయడం, ఆర్థమెటిక్)ను అమలు చేయగా.. దాని స్థానంలో 2019-20 సంవత్సరానికి ‘మూలాల్లోకి వెళ్దాం’ అనే పేరుతో ఏబీసీ (అటైన్మెంట్ ఆఫ్ బేసిక్ కాంపిటెన్సీ) కార్యక్రమాన్ని అమల్లోకి తెచ్చింది.
దేశంలో 6 నుండి 14 సంవత్సరాల వయస్సు గల పిల్లలలో 95 శాతం పైగా పాఠశాలలో నమోదు చేయబడ్డారు. ఈ పిల్లల్లో చాలామందికి పై తరగతులకు వెళ్లడానికి అవసరమైన పునాది నైపుణ్యాలు లేవు. అటువంటి పిల్లలు ప్రాథమిక పఠనం, అంకగణితాన్ని త్వరగా ఎలా నేర్చుకోవాలనేది సవాల్. హొ
Aూజు= 2022 ప్రకారం ప్రాథమిక పఠనం, అంకగణిత నైపుణ్యాలు: భారతదేశంలో 3, 5 తరగతుల్లోని చిన్న పిల్లల ప్రాథమిక పఠనం, అంకగణిత నైపుణ్యాలు క్షీణించాయి. 2018 లో 3 వ తరగతి (ప్రభుత్వ లేదా ప్రైవేట్ పాఠశాలలు)లోని పిల్లలు రెండవ తరగతి స్థాయిలో 27.3% మంది చదవగలిగితే, 2022 లో 20.5% గా నమోదైంది.హొమూడవ తరగతిలో కనీసం వ్యవకలనం చేయగల పిల్లలు 28.2% 2018లో ఉండగా 2022 లో 25.9% కి పడిపోయింది.హొ
తెలంగాణ రాష్ట్రంలో బడ్జెట్ విషయంలో ప్రాథమిక పాఠశాలలకు 2019- 20 కాలంలో 6.76% (12, 220.75 కోట్లు), 2020-21 కాలంలో 6.69 శాతం (12,144.27 కోట్లు), 2021- 22 కాలంలో 6.78 శాతం (15, 608 కోట్లు), 2022-23 కాలంలో 6.24% (16, 042 కోట్లు), 2023- 24 కాలంలో 19093 కోట్లు కేటాయిస్తుంది. కానీ ప్రాథమిక విద్యకు అనుకున్నంత స్థాయిలో కేటాయింపులు జరగడం లేదనేది సత్యం. ఈ కేటాయింపులు పాఠశాలల ఉన్నతికి మౌలిక వసతులకు నూతన భవంతుల ఏర్పాటుకు, గ్రంథాలయాల ఏర్పాటుకు, లాబొరేటరీ ఏర్పాటుకు, సాంకేతిక ఉపకరణాలకు కేటాయించారు. చిన్న చిన్న రాష్ట్రాల బడ్జెట్ కేటాయింపులతో పోల్చితే మన పాఠశాలల బడ్జెట్ చాలా తక్కువ. రెండు దశాబ్దాల కాలంగా గ్రంథాలయాలకు కేటాయింపులు జరుగుతున్నప్పటికీ, వాటికి కేటాయించిన డబ్బులను మిగతా వాటికి ఉపయోగించి గ్రంథాలయాల సేవలను నిరుపయోగం చేశారు. ఇప్పటికైనా రెండు తెలుగు రాష్ట్రాలు పాఠశాలలలో గ్రంథాలయాలు ఏర్పాటు చేస్తామనడం స్వాగతించదగ్గ విషయం.హొ
హొఅదేవిధంగా బేసిక్ విద్య అందరికీ అందుబాటులో ఉండాలని సామాన్య, మధ్య తరగతి ప్రజల పిల్లలకు నాణ్యమైన విద్యను అందివ్వాలనే ఉద్దేశంతో గత సంవత్సరం విద్యాశాఖ మన ఊరు-మనబడి, మనబస్తీ- మనబడి అనే కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇందులో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా పాఠశాలలో విద్యార్థులకు కనీస వసతులతో పాటు ప్రస్తుత సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని ప్రస్తుత కాలమాన పరిస్థితులకు అనుగుణంగా (గ్రంథాలయం, రక్షిత మంచినీరు, లాబరేటరీ, చక్కటి ఫర్నిచర్, కంప్యూటర్లు, డిజిటల్ విద్యకు కావలసినటువంటి పరికరాలు) విద్యను అందించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా 5000 పాఠశాలలో రీడింగ్ రూమ్స్ ఏర్పాటు చేసి విద్యార్థులకు సరియైన అకడమిక్ పుస్తకాలే కాకుండా జనరల్ పుస్తకాలు (బొమ్మల పుస్తకాలు, స్టోరీ బుక్స్, కామిక్ బుక్స్, చిన్న చిన్న డిక్షనరీలు) దినపత్రికలు, నేషనల్ బుక్ ట్రస్ట్, చిల్డ్రన్ బుక్ ట్రస్ట్ వారి సహాయ సహకారాలతో ప్రతి గ్రంథాలయానికి 200 పై ఎతీలుకు పుస్తకాలు అందిస్తున్నారు.హొ
స్వచ్ఛంద సంస్థలు (రూమ్ టు రీడ్, రూరల్ లైబ్రరీ ఫౌండేషన్, బ్రెడ్ సొసైటీ, బాల చెలిమి గ్రంథాలయాలు) రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని ప్రాంతాలలో ఉన్న పాఠశాలల్లో గ్రంథాలయానికి కావాల్సిన కొన్ని పుస్తకాలు, కనీస వసతులు కల్పిస్తూ విద్యార్థులకు చదివే అలవాటును పాదుకొల్పే ప్రయత్నం చేశారు. ఆంధ్రప్రదేశ్ పాఠశాల గ్రంథాలయాలు, గ్రామాల్లో డిజిటల్ గ్రంథాల ఏర్పాటుకు నిధులు కూడా కేటాయించింది. కొన్నిచోట్ల డిజిటల్ అందుబాటులోకి వచ్చాయి కూడా. అయితే అక్కడ పాఠశాల గ్రంథాలయాలను, డిజిటల్ గ్రంథాలయాలను, పౌర గ్రంథాలయాలను అనుసంధానం చేసి విద్యార్థులను ఉపయోగించుకునేలా ప్రేరేపించే ప్రయత్నం చేయాలి.
హొఈ విద్యా సంవత్సరం ‘ప్రతి విద్యార్థి చదివేలా చూడాలి’ అనే అంశంతో పఠనోత్సవం (రీడింగ్ క్యాంపెయిన్)కు శ్రీకారం చుట్టారు. విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలు, చదివే అలవాటు, గ్రంథాలయానికి వెళ్లే అలవాటు చేయాలని ఉద్దేశంతో తెలంగాణ విద్యాశాఖ ప్రభుత్వం సర్కారు పాఠశాలల్లో జూన్ 26 నుంచి జూలై 31వరకు కార్యక్రమం ‘ప్రతి విద్యార్థి చదివేలా చూడాలి’ అనే నినాదంతో కార్యక్రమం చేపడుతుంది.
అదేవిధంగా పాఠశాల కాల పట్టికలో రోజూ ఒక పీరియడ్ (గ్రంథాలయానికి ఒక గంట సమయం) ప్రత్యేకంగా కేటాయింపు జరుగుతున్నది. ఇక్కడ ఒక విషయం ఏమంటే ఈ పఠనోత్సవం ఒక నెల రోజులు కాకుండా కాల పట్టికలో ఒకటవ తరగతి నుండి పదవ తరగతి వరకు గ్రంథాలయ అవర్‌ను కచ్చితంగా కేటాయించాలి. విద్యార్థులకు గ్రంథాలయాలలో అకాడమిక్ పుస్తకాలే కాకుండా పిల్లలను ఆలోచింపజేసే, సామాజిక స్పహ కలిగించే పుస్తకాలను అందుబాటులో ఉంచాలి. ఇలా చేయడం వల్ల విద్యార్థులు సొంతంగా తన అకడమిక్ వర్కును చేసుకోవడం, సజనాత్మకంగా ఆలోచించడం, విన్నుతనంగా అభ్యసించడం, సంక్లిష్టమైన సమస్యలను కూడా ఎదుర్కొనే మానసిక స్థైర్యాన్ని అలవర్చుకుంటారు. అప్పుడే విద్యార్థులకు ఏ ఒక్క సబ్జెక్టు మీదనో కాకుండా అన్ని సబ్జెక్టులలో నిష్ణాతులవుతారు. ఇక్కడ ఉపాధ్యాయుల సహాయ సహకారాలూ స్వాగతించాల్సిందే.
విద్యార్థుల ప్రతిభను వెలికితీసేందుకు పఠనోత్సవ కార్యక్రమం ఎంతో దోహదపడుతుంది. 6 నుంచి 9 వ తరగతి చదివే విద్యార్థులకు గ్రంథాలయ కమిటీని ఏర్పాటు చేసి విద్యార్థులకు పుస్తకాలు ఇవ్వడం, చదివిన పుస్తకాలు తీసుకోవడం వంటి బాధ్యతలను ఉపాధ్యాయులు విద్యార్థులకు అప్పగిస్తారు. ప్రధానంగా పాఠ్య పుస్తకాల్లోని పాఠాలు, పాఠ్యేతర పుస్తకాలు, కథల పుస్తకాలు, వార్తా పత్రికలు వంటివి ధారాళంగా చదివే సామర్థ్యం పెంపు కోసం ఈ పఠనోత్సవ కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేస్తున్నది. పూర్వ ప్రాథమిక విద్యార్థులు వర్ణమాల అక్షరాలను గుర్తించడం, 1వ తరగతి విద్యార్థులు సరళ పదాలు, గుణింత పదాలు, 2వ తరగతి విద్యార్థులు ద్విత్వ, సంయుక్తాక్షర పదాలను, వాక్యాలను ధారాళంగా చదవగలగడం, 3 నుంచి ఆపై తరగతుల విద్యార్థులు అన్ని సబ్జెక్టులకు చెందిన పాఠ్యాంశాలతో పాటు వారి స్థాయికి తగిన బాల సాహిత్యాన్ని, వార్తా పత్రికలను ధారాళంగా చదివే సామర్థ్యం పెంపు కోసం ప్రభుత్వం రీడింగ్ క్యాంపెయిన్ ను చేపట్టింది
హొమాయ ఏంజెలో చెప్పినట్లుహొపిల్లలకి చదవడం అలవాటు చేసుకోవడానికి, పఠనాన్ని నిరంతర అవసరాలలో ఒకటిగా మార్చడానికి సహాయపడే ఏదైనా పుస్తకం ఇవ్వడం మంచిది.
విద్యార్థులు విరామ కాలం సద్వినియోగం చేసుకునేలా సజనాత్మక ఆలోచనలకు, వ్యక్తీకరణ సామర్థ్యానికి బాటలు వేసేలా ఈ కార్యక్రమం చేపడుతున్నారు. రెగ్యులర్ తరగతులకు ఆటంకం కలుగకుండా పాఠ్యాంశాలు బోధించి విద్యార్థులందరూ ధారాళంగా చదువగలిగేలా చేయడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం.
ప్రతి పీరియడ్‌లో ప్రతి ఉపాధ్యాయుడు తన సబ్జెక్టుకు సంబంధించిన అంశాన్ని విద్యార్థులతో పది నిమిషాలు బాహ్య పఠనం చేయించాలి. ఇంటి వద్ద చదివేలా విద్యార్థులకు గ్రంథాలయ పుస్తకాలతో పాటు రకరకాల మ్యాగజైన్లు ఇవ్వాలి. వాటిని తల్లిదండ్రులకు చదివి వినిపించాలి,హొ రోజూ ప్రార్థన సమయంలో ఇద్దరు, ముగ్గురు విద్యార్థులతో పుస్తకాలను చదివించాలి. అదేవిధంగా తల్లిదండ్రుల సమావేశంలో విద్యార్థులతో చదివించాలి, బాగా చదివే పిల్లలను అభినందించాలి. విద్యార్థుల పుట్టిన రోజు సందర్భంగా వారికి బహుమతిగా పుస్తకాలను అందజేయాలి. గ్రంథాలయాలు ఏర్పాటు చేసుకోవడానికి, పుస్తకాలు సేకరించడానికి స్వచ్ఛంద సంస్థలను భాగస్వాములను చేయాలి. పాఠశాలల్లో గ్రంథాలయాలు అందుబాటులో లేని చోట పౌర గ్రంథాలయాలను విరివిగా ఉపయోగించుకోవాలి. లేదా ఇక్కడి నుండి పుస్తకాలను పాఠశాలలకు తాత్కాలిక పద్ధతిన అందించే ప్రయత్నం చేయాలి.
పఠనం యొక్క ప్రాముఖ్యత గురించి ఎవరైనా ప్రముఖ వ్యక్తిచే పిల్లలకు అవగాహన కల్పించడం, పుస్తక పఠన ఆవశ్యకతను తెలియజేస్తూ ఇంటింటికి ర్యాలీలాగా వెళ్ళడం,హొపుట్టినరోజు లాంటి సందర్భాలలో పిల్లలకు బహుమతిగా పుస్తకాలను అందజేయటం పట్ల తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలి. పాఠశాల గ్రంథాలయానికి పుస్తకాలను సేకరించే కార్యక్రమం, దాతల నుండి గాని, పాఠశాల ఉపాధ్యాయ ఇళ్లలో ఉండే వివిధ రకాల కథల పుస్తకాలు గానీ, వార్తాపత్రికలలో పిల్లల పేజీలలో ఉండే కథలు, బొమ్మలు వివిధ రకాల పజిల్స్ వంటి వాటిని సేకరించడం, వీటన్నింటినీ పిల్లలకి అందుబాటులో ఉంచే కార్యక్రమాలు,హొపఠన సామాగ్రి అభివద్ధి, విద్యార్థుల చేత పేపర్ కటింగ్స్, కార్టూన్స్ పజిల్స్ మొదలైన రీడింగ్ కార్డ్స్‌ని ఒక్కో పాఠశాలకు వంద చొప్పున స్వయం అభ్యసన సామాగ్రి తయారు చేయించి అందుబాటులో ఉంచాలి.
పిల్లలకు పఠన పోటీలు నిర్వహించడం,హొఈ పోటీల్లో భాగంగా వారితో కథలు చదివించడం, పుస్తక సమీక్ష, పిల్లలు సొంతగా కథలు చెప్పటం వంటి అంశాలలో పోటీలను నిర్వహించాలి. వేగంగా తప్పులు లేకుండా చదవగలగటం అనే అంశంలో కూడా పోటీలు నిర్వహించాలి.
గ్రంథాలయ పీరియడ్‌లో 3 రోజులు తెలుగు, హిందీ, ఉర్దూ చదివించాలి. మిగిలిన మూడ్రోజులు ఆంగ్లం, ఇతర సబ్జెక్టులు చదివించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదే. విద్యార్థులకు వ్యాసరచన, ఉపన్యాస పోటీలు నిర్వహించాలి. కవులు, రచయితలు, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామ ప్రముఖులు, ఇతరులు పాఠశాలను సందర్శించిన సమయంలో వారితో గ్రంథాలయంలోని కథల పుస్తకాలను చదివించి విద్యార్థుల్లో పుస్తక పఠనం పట్ల ఆసక్తిని పెంచాలి.
అదేవిధంగా ఆ ప్రాంతంలో ఉన్న రచయితలను, కవులను పిలిపించి వారు రాసిన పుస్తకాలపై సమీక్ష నిర్వహిస్తే విద్యార్థులకు సాహిత్యంపై అవగాహన కలుగుతుంది. అదేవిధంగా ఆ ప్రాంతపు చరిత్రకారులను పిలిపించి ఆ ప్రాంత చరిత్రపై చర్చలు నిర్వహిస్తే ఆ ప్రాంత చరిత్రపై పిల్లల్లో అవగాహన కలుగుతుంది. ఆ ప్రాంతంలో ఉన్న ఆంగ్ల ఉపాధ్యాయుని పిలిపించి చిన్నచిన్న ఆంగ్ల కథలపై చర్చలు నిర్వహిస్తే ఆంగ్లంపై విద్యార్థులకు ఆసక్తి పెరిగి, పట్టు వస్తుంది. ఇలా విద్యార్థులను ఆకర్షించే, చదువు పైకి వాళ్ళ అవగాహన మళ్లించే కార్యక్రమాలు చేపట్టాలి. ముఖ్యంగా గ్రంథాలయానికి వెళుతున్నామంటే అకడమిక్ పుస్తకాలు చదివేటందుకే వెళుతున్నామనే అభిప్రాయం కాకుండా, వివిధ పుస్తకాలపై మమకారంతో, చదవాలనే ఉత్సాహంతో, కథను నేర్చుకోవాలనే తాపత్రయంతో వెళుతున్నామనే స్పహ, ఎరుక పిల్లలను కలగాలి. అలాంటప్పుడే పిల్లలు గ్రంథాలయాలకు ఇష్టంగా, ప్రేమగా వెళ్లేందుకు మక్కువ చూపుతారు.
పై అన్ని విషయాలను చూసినట్లయితే విద్యార్థులకు గ్రంథాలయాలకు వచ్చే అలవాటును ప్రేరేపించాలన్నా, చదివే అలవాటును కల్పించాలన్నా, పుస్తకాలను సేకరించాలన్నా, పుస్తకాలను విద్యార్థులకు అందుబాటులో ఉంచాలన్నా, విద్యార్థులను ఆకర్షించే కార్యక్రమాలు చేపట్టాలన్నా అర్హత కలిగిన గ్రంథ పాలకుల నియామకం కచ్చితంగా ఉండాల్సిందే. తెలంగాణ రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, గిరిజన, మైనార్టీ గురుకుల విద్యాలయాలలో గ్రంథ పాలకుల నియామకం కొంత చేపట్టారు. మిగతా వాటికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాల గ్రంథాలయాలు కానీ, గురుకుల విద్యాలయ గ్రంథాలయాల్లో కానీ డిజిటల్ గ్రంథాలయాల్లో కానీ, పౌర గ్రంథాలయాల్లో కానీ గ్రంథ పాలకుల నియామకం లేకపోవడం నిట్టూర్చాల్సిన విషయం.
సంపన్నమైన విజ్ఞానాన్ని కలిగిన ఒక తరాన్ని (యువతను) ఈ దేశానికి అందించాలంటే పాఠశాల స్థాయిలో సమగ్రమైన గ్రంథాలయాలు ఉండాల్సిందే… విద్యార్థులు వాటిని ఉపయోగించుకోవాల్సిందే.