మరో బ్లాక్‌బస్టర్‌కి రెడీ..

Ready for another blockbuster..‘దసరా’ సినిమాతో 100 కోట్లకు పైగా వసూళ్ళతో ఘన విజయం సాధించిన తరువాత నాని, దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల మరో ప్రాజెక్ట్‌ చేయబోతున్నారు. ఎస్‌ఎల్‌వి సినిమాస్‌ బ్యానర్‌పై సుధాకర్‌ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ కొత్త చిత్రానికి సంబంధించి మేకర్స్‌ రిలీజ్‌ చేసిన అనౌన్స్‌మెంట్‌ వీడియో అందరిలో క్యూరియాసిటీని రైజ్‌ చేసింది. ఓ అద్భుతమైన ప్రాజెక్ట్‌ తన నుంచి రాబోతోందనే కమిట్‌మెంట్‌ను దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల చూపించారని ఈ వీడియో చెప్పకనే చెప్పింది. ‘మార్చి 7, 2023 – నా ఫస్ట్‌ సినిమా ‘దసరా’కి నేను చెప్పిన చివరి ‘కట్‌, షాట్‌ ఓకే’. సెప్టెంబర్‌ 18, 2024 – నానిఓదెల 2 అనౌన్స్‌మెంట్‌ వీడియో కోసం మళ్ళీ ‘యాక్షన్‌’ చెప్పాను. ఈ క్రమంలో 48,470,400 సెకన్లు గడిచాయి! ప్రతి సెకను నా నెక్స్ట్‌ సినిమా కోసం సిన్సియర్‌గా ఉన్నాను. ‘దసరా’ ప్రభావాన్ని 100 రెట్లు క్రియేట్‌ చేస్తానని ప్రామిస్‌ చేస్తున్నాను’ అని శ్రీకాంత్‌ ఓదెల అన్నారు. నాని తన రెస్పాన్స్‌తో అభిమానులని అలరించారు. ‘ఇతని మ్యాడ్‌ నెస్‌ నా జీవితంలోకి తిరిగి వచ్చింది’ అని అన్నారు.