అప్సరా రాణి, విజరు శంకర్, వరుణ్ సందేశ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘రాచరికం’. ఈశ్వర్ నిర్మాతగా చిల్ బ్రోస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ మూవీని నిర్మించారు. సురేశ్ లంకలపల్లి దర్శకుడు. ఈ మూవీని ఈనెల 31న గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరో విజరు శంకర్ మాట్లాడుతూ,’రాయలసీమ అంటే ఏంటో ఈ సినిమా చూపిస్తుంది. మ్యూజిక్ డైరెక్టర్ వెంగి ఇచ్చిన పాటలు, ఆర్‌ఆర్ ఇంకా మైండ్‌లోనే తిరుగుతున్నాయి. రామ్ ప్రసాద్ రాసిన డైలాగ్స్ గూస్ బంప్స్ తెప్పిస్తాయి’ అని తెలిపారు. ‘ఈ సినిమాలో నెగెటివ్ పాత్ర చేశాను. ‘మైఖేల్’ తరువాత మళ్లీ ఈ పాత్ర నన్ను ఎగ్జైట్ చేసింది. అందుకే ఈ సినిమాలో నటించాను. మ్యూజిక్ బాగుంది. విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి’ అని వరుణ్ సందేశ్ చెప్పారు. దర్శకుడు సురేశ్ లంకలపల్లి మాట్లాడుతూ,’ఈ సినిమాకు నా టీమ్ ఎంతో సహకరించింది. మ్యూజిక్ డైరెక్టర్ వెంగి, డీఓపీ ఆర్య సాయి, రైటర్ రాం ప్రసాద్, వీఎఫ్‌ఎక్స్ చందు, ఎడిటర్ జేపీలకు ప్రత్యేకంగా థ్యాంక్స్. కెమెరా వర్క్ చాలా రిచ్‌గా ఉంటుంది. వంద కోట్లతో తీసిన సినిమాలా కనిపిస్తుంది. కథ రాసినప్పటి నుంచి ఈశ్వర్ నాతోపాటున్నారు. ఎవరి కోసమో ఎదురుచూడటం ఎందుకు మనమే నిర్మిద్దామని ఈశ్వర్ ముందుకు వచ్చారు’ అని తెలిపారు. ‘డైరెక్టర్ మారుతి ట్రైలర్ లాంచ్ చేయడంతో మా సినిమా ఎక్కువగా రీచ్ అయింది. శ్రీ విష్ణు ‘మౌలా’ పాటను, ‘టిక్కు టిక్కు’ పాటను రాహుల్ సంకత్యాన్ రిలీజ్ చేశారు. నేను, సురేష్, చాణక్య కలిసి చేసిన ఈ సినిమాకు నా ఫ్రెండ్స్ అండగా నిలిచారు. ఈనెల 31న ఈ చిత్రం రాబోతోంది’ అని నిర్మాత ఈశ్వర్ చెప్పారు.