నోయల్, రిషిత నెల్లూరు హీరో, హీరో యిన్లుగా నటిస్తున్న సినిమా ‘బహిర్భూమి’. ఈ చిత్రాన్ని మహకాళి ప్రొడక్షన్ బ్యానర్ పై మచ్చ వేణుమాధవ్ నిర్మిస్తున్నారు. రాంప్రసాద్ కొండూరు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా అక్టోబర్ 4న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రాబోతోంది. తాజాగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ప్రసాద్ ల్యాబ్స్‌లో ఘనంగా నిర్వహించారు. నిర్మాత మచ్చ వేణు మాధవ్ మాట్లాడుతూ, ‘మా సినిమాకు సెట్ బారు నుంచి హీరో వరకు ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేశారు. ఇలాంటి మంచి మూవీ నిర్మించినందుకు ఆనందంగా ఉంది. అక్టోబర్ 4న ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నాం. మరికొద్ది రోజుల్లో ఇతర భాషల్లోనూ మా సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం. అలాగే నేడు (సోమవారం) న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ బిల్ బోర్డ్ పై మా మూవీ ట్రైలర్ డిస్ ప్లే చేస్తాం. హాష్ ట్యాగ్ ‘బహిర్భూమి’ అని సోషల్ మీడియా పోస్టులు చేసిన వారిలో ముగ్గురిని ఎంపిక చేసి ఒక్కొక్కరికి 5 వేల రూపాయల బహుమతి అందిస్తాం. థియేటర్‌లో మా సినిమా చూస్తారని ఆశిస్తున్నా’ అని అన్నారు. ”’బహిర్భూమి’ అనే మాటకు ఎంతో చరిత్ర ఉంది. అప్పట్లో రెండు ఊర్ల మధ్యలో బహిర్భూమి ప్లేస్ కోసం గొడవలు జరిగేవి. ఈ టైటిల్ సినిమాకు ఎందుకు పెట్టామో మూవీ చూస్తే తెలుస్తుంది. మా వేణు మాధవ్ మంచి ప్రొడ్యూసర్. అలాంటి మంచి ప్రొడ్యూసర్స్ ఇండిస్టీలో స్థిరపడాలి. మా సినిమాకు హీరో నోయెల్ ఎంతో సపోర్ట్ చేశారు. ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ ఇచ్చిన సపోర్ట్‌తో మీ అందరికీ నచ్చేలా సినిమా చేయగలిగాను. మా సినిమాను చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నాను’ అని దర్శకుడు రాంప్రసాద్ కొండూరు చెప్పారు. హీరో నోయెల్ మాట్లాడుతూ, ‘ఇలాంటి మంచి చిత్రంలో నటించినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇది అందరికీ కనెక్ట్ అయ్యే సినిమా’ అని తెలిపారు.