రక్షిత్ అట్లూరి, అపర్ణా జనార్థన్, సంకీర్తన విపిన్, శత్రు కీలక పాత్రధారులుగా రూపొందు తున్న చిత్రం ‘నరకాసుర’. సెబాస్టియన్ దర్శకత్వంలో సుముఖ క్రియేషన్స్, ఐడియల్ ఫిల్మ్ మేకర్స్‌పై ఆజ్జా శ్రీనివాస్ నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తయిన ఈ చిత్రాన్ని సెప్టెంబర్ రెండో వారంలో తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ”నరకాసుర’ అనే రాక్షసుడి జననం నేపథ్యంలో యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన చిత్రమిది. ఇటీవల విడుదలైన టీజర్‌ను చూసిన పలువురు సినీ ప్రముఖులు ‘కాంతారా రేంజ్‌లో ఉందని ప్రశసించడం హ్యాపీగా ఉంది’
అని దర్శకుడు అన్నారు.