తెలుగులో రిలీజ్‌కి రెడీ

Ready for release in Teluguథ్రిల్లింగ్‌ యాక్షన్‌ సన్నివేశాలు, పవర్‌ ఫుల్‌ ఫైట్‌లతో జూలియస్‌ ఓనా దర్శకత్వం వహించిన చిత్రం ‘కెప్టెన్‌ అమెరికా: బ్రేవ్‌ న్యూ వరల్డ్‌’. ఇది ‘ఎంసియు’ నుంచి వస్తున్న 6వ భాగం. హ్యారీసన్‌ ఫోర్డ్‌ పోషించిన రెడ్‌ హల్క్‌ పాత్ర ప్రేక్షకుల్ని విశేషంగా అలరించడంతో, ఆయన ఈ సినిమాలో ఏమీ చేయబో తున్నారోననే ఆసక్తి అందరిలోనూ ఉంది. ఈ సినిమా ఈనెల 14న ఇంగ్లీష్‌, హిందీ, తమిళంతో పాటు తెలుగులోనూ విడుదల కానుంది. ఈ సినిమా విడుదల సందర్భంగా హ్యారీసన్‌ ఫోర్డ్‌ మాట్లాడుతూ, ‘మార్వెల్‌ సినిమాటిక్‌ యూనివర్స్‌లో అడుగు పెట్టడం చాలా ఆనందంగా ఉంది. ఇందులో నా పాత్ర చాలా పవర్‌ఫుల్‌ డైనమిక్స్‌తో ఉంటుంది. ముఖ్యంగా రాజకీయ కుట్రలో ఇరుక్కున్నప్పుడు తదుపరి నా లక్ష్యం ఏమిటనేది చాలా ఆసక్తి కరంగా ఉంటుంది. ఇందులో ఉన్న పొలిటికల్‌ థ్రిల్లర్‌ అంశం అందర్నీ అలరిస్తుంది. అలాగే కొన్ని అద్భుతమైన విషయాలూ ఉన్నాయి. బలమైన, భావోద్వేగ కథ కూడా ఉంది’ అని తెలిపారు.