నిజమైన లబ్ధిదారులను గుర్తించడం లేదు..

Real beneficiaries are not identified.– బిజెపి పట్టణ అధ్యక్షులు పందుల సత్యం గౌడ్ 
నవతెలంగాణ – చండూరు  
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఏర్పాటు చేసిన గ్రామసభలో నిజమైన లబ్ధిదారులను గుర్తించడంలో అధికారులు వైఫల్యం అయ్యారని బిజెపి పట్టణ అధ్యక్షులు పందుల సత్యం గౌడ్ ఆరోపించారు. మంగళవారం మున్సిపల్ పట్టణంలో పలుచోట్ల ప్రజాపాలన వార్డుసభలను  పరిశీలించి ఆయన మాట్లాడారు.  మున్సిపల్ పట్టణంలో వార్డు సభలు జరుగుతున్నాయని వార్డులలో ముందస్తు సమాచారం లేదన్నారు.నిజమైన లబ్ధిదారులను గుర్తించడం లేదన్నారు. దీంతో పలుచోట్ల గొడవలు జరిగి, లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇంద్రమ్మ ఇల్లు, రేషన్ కార్డు  కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ కొంతమంది  అర్హత  కలిగిన లబ్ధిదారులు  పేర్లు రానప్పటికీ  మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని అధికారులు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఇది ఏమైనా నిజమైన లబ్ధిదారులు గుర్తించకుంటే  బిజెపి పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు.