నిజమైన విద్యార్థి ఉద్యమకారులకు రాజకీయాల్లో చోటు లేదా?

           మునుపెన్నడు లేని రాజకీయ చతురతతో నైతిక విలువలు మరచి సామాజిక న్యాయం పాటిం చని పార్టీగా, ఉద్యమ ద్రోహుల పార్టీగా, కమ్యూని స్టులతో మిత్రద్రోహం చేసిన పార్టీగా విద్యార్థి ఉద్యమకారులను మోసం చేసిన నిజమైన దొరల గడిల పార్టీగా పూర్తిస్థాయిలో తన ముఖచిత్రాన్ని ఆవిష్కరించింది బీఆర్‌ఎస్‌ పార్టీ. ఏ ఉద్యమమైన ఉవ్వెత్తున ఎగిసిపడాలంటే ఉరకలేత్తే యువరక్తం ఆ ఉద్యమానికి జీవనాడుల్లా పని చేస్తాయి. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ఉద్యమంతో ఉవ్వె త్తున ఎగిసిన తెలంగాణ ఉద్యమమే దానికి నిద ర్శనం కానీ ఆ యువరక్తానికి భవిష్యత్తు రాజకీయా లను నడపడానికి కావలసిన ప్రోత్సాహాన్ని ఇవ్వడం లో రాజకీయ పార్టీలు ఎందుకో భయపడుతున్నాయి. కేసీఆర్‌ మొదటిసారి ఇచ్చిన ప్రాధాన్యతను ఇప్పుడు విద్యార్థి ఉద్యమకారుల త్యాగాలను, తెలంగాణ కోసం అమరులైన అమరవీరుల త్యాగాలను, మునుగోడులో కమ్యూనిస్టుల మద్దతుతోనే గెలిచి వారిని అవమానిస్తూ పక్కన పెడుతున్న కెేసీఆర్‌ కు విద్యార్థి నిరుద్యోగులు, రైతులు, కార్మికులు, అమరవీరుల కుటుంబాలు తిరగబడే రోజు ఆసన్నమైందనే చెప్పాలి. ప్రధానంగా తెలంగాణ ఉద్యమానికి కేంద్ర బిందువైన ఓయూ విద్యార్థి ఉద్యమ నాయకుల విషయంలో అది స్పష్టంగా కనబడుతుంది.
ప్రత్యేక తెలంగాణ సాధన ఉద్యమంలో, రాజకీ యాల్లో కీలకపాత్ర పోషించి ఎన్నో నిర్బంధాలను, త్యాగాలను, సామాజిక, బహుజన, దళిత, విప్లవ ఉద్యమాలు చేసిన ఉస్మానియా యూనివర్సిటీ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల నిజమైన విద్యార్థి ఉద్యమ కారులు ఈసారి రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా తమ పాత్ర ఉండాలని, కోరుకుంటున్నారు. గతంలో అన్ని పార్టీల నుంచి టికెట్లు ఆశించి భంగపడ్డ ఓయూ విద్యార్థి ఉద్యమకారులు. ఈ సారీ ఎలాగైనా ఆయా పార్టీల నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉండాలని ఆశిస్తున్న వారు చాలామంది ఉన్నారు. కానీ ముందుగానే బీఆర్‌ఎస్‌ ప్రకటించిన ఎమ్మెల్యే జాబితాలో కొత్తగా ఎవరికి నిజమైన విద్యార్థి ఉద్యమ కారులకు, అమరవీరుల కుటుంబాలకు టికెట్లు రాకపోవడంతో ఆ పార్టీకి సంబంధించిన విద్యార్థి నాయకులే నిరాశలో ఉన్నారు. మిగిలింది తెలంగాణ ఇచ్చిన పార్టీగా, తెలంగాణ ప్రజల చిరకాల కోరికను నెరవేర్చిన కాంగ్రెస్‌ పార్టీ నుంచి టికెట్లు ఆశిస్తు న్నారు. సోనియాగాంధీకి, రాహుల్‌గాంధీకి తెలంగా ణలో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి రిటర్న్‌ గిఫ్ట్‌ ఇవ్వాలని దృఢ సంకల్పంతో పనిచేస్తున్నారు. వామ పక్ష భావజాలంతో పనిచేసి కాంగ్రెస్‌ పార్టీలో చేరిన ఓయూ విద్యార్థి ఉద్యమకారులు ఎన్నో నిర్బంధాలను ఎదుర్కొని, తెలంగాణ ఉద్యమ సమయంలో అనేక కేసుల్లో జైలుకు వెళ్లి ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిరుగు తున్నారు. కేసీఆర్‌ ప్రజావ్యతిరేక, నిరుద్యోగ వ్యతిరేక విధానాలను తిప్పికొడుతూ పనిచేసిన నిజమైన ఉద్యమకారులు నేటికీ పోరాడుతూనే ఉన్నారు. వారు కూడా ఈసారి ఎలాగైనా కాంగ్రెస్‌ పార్టీ టికెట్లు ఇస్తుందనే నమ్మకంతో పని చేస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీ కూడా వారి పోరాటాలను గుర్తించి నిజమైన ఉద్యమకారులకు ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వా లని కోరుతున్నారు. తెలంగాణ ఉద్యమ సమయం లోని కేసులను మాఫీ చేస్తానని చెప్పి చేయని కెేసీఆర్‌ఖు తగిన గుణపాఠం చెప్పాలని యావత్‌ విద్యార్థి లోకం ఎదురుచూస్తున్నది. అదేవిధంగా రాహుల్‌ గాంధీ చెప్పినట్టు యువతకు పార్టీ పద వుల్లో, టికెట్లలో సముచిత స్థానం కల్పిస్తామని ప్రతి పార్లమెంటు పరిధిలో రెండు ఎమ్మెల్యే సీట్లను బీసీలకు ఇస్తానని ఉదయపూర్‌ డిక్లరేషన్‌ ప్రకటనకు కట్టుబడి ఉండాలి. అప్పుడే ప్రత్యేక తెలంగాణ కోసం పోరాడిన నిజమైన ఉద్యమకారులకు న్యాయం జరుగుతుంది. కాంగ్రెస్‌ పార్టీ దేనికోసమైతే తెలం గాణను ఇచ్చిందో అది సార్ధకత అవుతుంది.
కానీ కాంగ్రెస్‌ పార్టీ చురుకైన మలిదశ విద్యార్థి ఉద్యమకారులకు ఆ అవకాశం కల్పిస్తుందో లేదో వేచి చూడాల్సిందే. కాంగ్రెస్‌ పార్టీ గత చరిత్ర చూస్తే ఓయూ నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీలుగా, జైపాల్‌రెడ్డి, మధు యాస్కీగౌడ్‌, సంపత్‌కుమార్‌ లాంటి ఉద్దం డులు, పీవీ నరసింహారావు లాంటి వారు ప్రధాన మంత్రులైన చరిత్ర ఉన్నది. కానీ చాలా సంవత్స రాల వరకు ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమకారు లకు ఆ అవకాశాలు రాలేదు. ఇప్పుడు మళ్లీ అవకా శాలు వస్తాయని ఆశిస్తున్నారు విద్యార్థి ఉద్యమకా రులు. సహజంగానే విద్యార్థి నాయకులకు అన్ని పార్టీలు కూడా అతి తక్కువ సందర్భంలో టికెట్లు ఇచ్చినా పరిస్థితి ఉంది. అది కూడా ఎంతో పోరాడితే తప్పా నిజంగా పోరాడిన విద్యార్థి ఉద్యమకారులకు ఆ అవకాశాలు రావడం లేదు. ఈసారి కాంగ్రెస్‌ పార్టీలో గతంలో లాగా అన్యాయం జరిగితే ఇప్పుడు విద్యార్థుల మద్దతు ఏవిధంగా అయితే బీఆర్‌ఎస్‌ పార్టీ కోల్పోయిందో అలాగే కాంగ్రెస్‌ కూడా భవి ష్యత్తులో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల మద్దతు కోల్పోయే అవకాశం ఉందని విద్యార్థి ఉద్యమకారులు చర్చించుకుంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్‌ పార్టీకి నిరంతరం విద్యార్థి సమస్యలపై, ప్రజా సమస్యలపై కింది స్థాయిలో పోరాడే విద్యార్థి ఉద్యమకారుల అవసరం ఎంతైనా ఉంది. అలాంటి మేధోపరమైన, క్రియాశీలకమైన పోరాటాలు చేసే వారిని గుర్తించి వారిని ప్రోత్స హిస్తే యావత్‌ విద్యార్థి, నిరుద్యోగలోకం ఆ పార్టీకి సంపూర్ణమైన మద్దతిస్తారనడంలో ఎలాంటి సందే హంలేదు. తెలంగాణ ఉద్యమ సమయంలో లాఠీ లకు, బుల్లెట్లకు, కేసులకు, బెదిరింపులకు, నిర్బం ధాలకు, దాడులకు బెదరని వారు ఇప్పుడు కేసీఆర్‌ బెదిరింపులకు బెదిరేవారు కాదు ఉస్మానియా విద్యా ర్థులు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఈమధ్య ఎవరు ప్రశ్నిం చిన వారిని బెదిరింపులకు పాల్పడడం, నిర్బం ధించడం ప్రతీకారంతో రగిలిపోవడం చేస్తున్నది.
ఈ మధ్యకాలంలో ఓయూలోని ‘టీ’ పాయింట్‌ సెంటర్లో రాష్ట్ర రాజకీయాలపై సుదీర్ఘమైన చర్చలు జరుగుతున్నాయి. అన్ని రకాల విద్యార్థి సంఘాల నాయకులు చర్చల్లో పాల్గొంటూ ఈ పదేండ్ల బీఆర్‌ఎస్‌ పాలనా గురించి ప్రత్యేక తెలం గాణ ఉద్యమంలో ప్రజలు, నిరుద్యోగులు కోరుకున్నదేంటి? జరుగు తున్నదేంటి? పరిపాలనలో మేకపోతు గంభీర్యాన్ని ప్రదర్శి స్తున్న కెేసీఆర్‌ ప్రభుత్వాన్ని అనేక రకాలుగా విశ్లేషణ చేసుకుంటున్నారు. కెేసీఆర్‌ తప్పులను సరి చేసే బాధ్యత ఉస్మానియా విద్యార్థులే తీసుకోవాలని దఢ నిశ్చయంతో ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయా పార్టీల నుంచి టికెట్లు ఆశిస్తు న్నామన్నట్టు ప్రచారాలు కూడా జరిగాయి. కానీ ఈసారి కేసీఆర్‌ ప్రకటించిన జాబితాలో మళ్లీ పాత వారిని, పనిచేయని వారిని కొనసాగించడంతో అన్ని పార్టీల లాగానే బీఆర్‌ఎస్‌ కూడా ఓటమి భయంతో ఒత్తిళ్లకు, ప్రలో భాలకు లొంగిపోయారనే ప్రచారం జరుగుతున్నది. దీంతో నిజమైన విద్యార్థి ఉద్యమ కారులకు రాజకీయాల్లో చోటు లేదా అనే సందే హం వ్యక్తపరుస్తున్నారు. ఉస్మానియా యూనివర్సి టీలో ఏ నిరు ద్యోగ విద్యార్థిని కదిలించిన ఈసారి బీఆర్‌ఎస్‌ పార్టీని మూడోసారి గెలవనిస్తే సమ స్యలు విన్నవిం చుకోవడానికి కేసీఆర్‌ అపాయిం ట్మెంట్‌ కోసం మూడు చెరువుల నీళ్లు తాగాల్సి వస్తుందేమో అని విద్యార్థి నిరుద్యోగులు చెబుతు న్నారు. విద్యార్థుల పోరాటానికి చలించి ప్రత్యేక తెలంగాణను కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చింది కానీ కేసీఆర్‌ కుటుంబం కానీ వారి బానిస బలగం కానీ పోరాడితే రాలేదని ఉస్మానియా విద్యార్థులు చెబుతున్నారు. ఒక్క కేసీఆర్‌ కుటుంబంలోనే ఐదుగురు ఎమ్మెల్యే లుగా పోటీ చేస్తే దాన్ని ఉద్యమ పార్టీ అంటారా? కుటుంబ పార్టీ అంటారా? వీరేనా కుల సామాజిక న్యాయం పాటించేది? 93 శాతం ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఇచ్చిన సీట్లు ఎన్ని, 7శాతం ఉన్న ఓసీలు తీసుకున్న సీట్లు ఎన్ని, 33 శాతం మహి ళలకు రిజర్వేషన్‌ ఉండాలని ఢిల్లీ వేదికగా దీక్ష చేసిన కవిత తన తండ్రి మహిళలకు ఇచ్చిన సీట్ల విషయంలో ఏం సమాధానం చెబుతుంది. ఇలాంటి మాయమాటలు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు గమనిస్తూనే ఉన్నాయి వచ్చే ఎన్నికల్లో వారి ఓటే బీఆర్‌ఎస్‌ ఓటమికి ఆయుధంగా మారబోతుంది.
మిగతా పార్టీలు కూడా జాగ్రత్తపడాలి. యువ రక్తం ఉత్సాహవంతమైన నాయకత్వం ఉద్యమ స్ఫూర్తి కలిగినటువంటి యువకుల అవసరం చాలా ఉంది. అలాంటి నాయకత్వాన్ని పట్టుకోగలిగే దూర దృష్టి ఆయా పార్టీల అధిష్టానానికి ఉన్నదా.. లేదా? అనే సందేహం కూడా కలుగుతుంది. ప్రజా యుద్ధనౌక గద్దర్‌ చెప్పిన ”బానిసల్లారా లేండిరా ఈ భాంచన్‌ బతుకులు ఎందుకురా” అనే చివరి మాటలే ప్రధానాస్త్రంగా ఎన్నికల యుద్ధక్షేత్రంలోకి వెళ్లాలని అడుగులు వేస్తున్నారు. ప్రొఫెసర్‌ జయ శంకర్‌ కలలుగన్న తెలంగాణ కోసం కాకుండా భూ కబ్జాదారుల, అవినీతి కాంట్రాక్టర్ల, విద్యా ప్రయివేటీ కరణ కోసం పాటుపడే నాయకుల కోసమే కేసీఆర్‌ పనిచేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాళోజీ నారాయణరావు అన్నట్లు ”ప్రాంతేతరుడు మోసం చేస్తే ఆ ప్రాంత పొలిమేరలు దాటే వరకు తరిమికొట్టాలి. ప్రాంతంవాడే మోసం చేస్తే అదే ప్రాంతంలో పాతరేయాలి” అన్నట్టు తెలంగాణ కోసం ఉద్యమించిన నిజమైన విద్యార్థి నాయకులు ఈ ఎన్నికల్లో ప్రజాక్షేత్రంలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.
డా. రేమద్దుల మండ్ల రవి
9177706626