నిజంగానే మాయ.. చేస్తోంది

Maya is really doing the trickకళ్యాణ్‌ రామ్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘డెవిల్‌’. ‘బ్రిటీష్‌ సీక్రెట్‌ ఏజెంట్‌’ అనేది ట్యాగ్‌ లైన్‌. నవంబర్‌ 24న ఈ చిత్రం రిలీజ్‌ కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ‘మాయే చేశావే..’ అంటూ సాగే తొలి పాటను మేకర్స్‌ విడుదల చేశారు. ”ఐకాన్‌ మ్యూజిక్‌ రిలీజ్‌ చేసిన ఈ అద్బుతమైన మెలోడీ సాంగ్‌ అందర్నీ మెస్మరైజ్‌ చేస్తోంది. స్టార్‌ సింగర్‌ సిద్‌ శ్రీరామ్‌ ఈ పాటను పాడటం హైలైట్‌.. బంద మాస్టర్‌ కొరియోగ్రఫీ, హర్షవర్ధన్‌ రామేశ్వర్‌ సూపర్బ్‌ రెట్రో ట్రాక్‌, కళ్యాణ్‌ రామ్‌, సంయుక్త మధ్య కుదిరిన కెమిస్ట్రీతో మేకర్స్‌ ఓ ఎగ్జైటింగ్‌ మ్యూజికల్‌ జర్నీని స్టార్ట్‌ చేసి ప్రేక్షకుల హదయాలను ఆకట్టుకున్నారు. స్వాతంత్య్రం రాక ముందు ఉన్న బ్యాక్‌డ్రాప్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు. అభిషేక్‌ పిక్చర్స్‌ పతాకంపై అభిషేక్‌ నామా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తూ, నిర్మిస్తున్నారు.