రియల్‌మీ నార్జో 60 సిరీస్‌ 5జి విడుదల ధర రూ.17,999

హైదరాబాద్‌ : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ కంపెనీ రియల్‌మీ కొత్తగా రియల్‌మీ నార్జో 60 సిరీస్‌ 5జి, రియల్‌మీ బడ్స్‌ వైర్‌లెస్‌ 3 ఉత్పత్తులను ఆవిష్కరించింది. సోమవారం వీటిని రియల్‌మీ ప్రొడక్ట్‌ మేనేజర్‌ బాజుల్‌ కొచర్‌ హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్బంగా కొచర్‌ మాట్లాడుతూ.. నార్జో 60 5జి నార్జో 60 ప్రో 5జి స్మార్ట్‌ఫోన్లు వినియోగదారులకు విశేష అనుభవాన్ని పంచనున్నాయన్నారు. వీటి ప్రారంభ ధరలను వరుసగా రూ.17,999, రూ.23,999గా నిర్ణయించామన్నారు. నో కాస్ట్‌ ఇఎంఐపై అమెజాన్‌లో లభిస్తాయన్నారు. 5000 ఎంఎహెచ్‌ బ్యాటరీ, 64 ఎంపి స్ట్రీట్‌ ఫోటోగ్రపీ కెమెరా, 1టిబి స్టోరేజీకి విస్తరించుకునే సౌలభ్యం, 20ఎక్స్‌ డిజిటల్‌ జూమ్‌ ఫీచర్లతో వీటిని ఆవిష్కరించామన్నారు. గడిచిన నాలుగేళ్లలో నార్జోలో 1.34 కోట్ల ఉత్పత్తులను విక్రయించామన్నారు. గడిచిన ఆరు నెలల్లోనే 10 లక్షల నార్జో స్మార్ట్‌ఫోన్ల అమ్మకాలు చేశామన్నారు. తెలుగు రాష్ట్రాల్లో తమకు రెండంకెల మార్కెట్‌ వాటా ఉందన్నారు.