ప్రభుత్వ భూమి కబ్జా చేసిన రియల్టర్స్‌

– సర్వే చేసిన రెవెన్యూ యంత్రాంగం
– ఇరిగేషన్‌, రెవిన్యూ అధికారుల సమన్వయ లోపం
– సమాచారం ఇస్తే గాని గుర్తించని అధికారులు
– ప్రభుత్వ భూమిలో హద్దు
– రాళ్లు, బోర్డులు లేక పోవడంతో ఇష్టా రాజ్యాంగం కబ్జా చేస్తున్న బడా నేతలు
– చూసీచూడనట్టు వ్యవహరిస్తున్న సంబంధిత అధికారులు
నవతెలంగాణ-ఆదిబట్ల
ప్రభుత్వ భూమి కబ్జా చేసి యాథేచ్చగా భవనాలు నిర్మిస్తున్న రియల్టర్స్‌, చూసీ చూడనట్టు వదిలేస్తున్న ఇరిగేషన్‌, రెవిన్యూ అధికారులు, స్థానిక ఆదిబట్ల మున్సి పల్‌ వార్డ్‌ కౌన్సిలర్‌ వివరాల ప్రకారం ఆదిబట్ల మున్సి పల్‌ పరిధిలోని సర్వే నంబర్‌ 231,232,233,234 లో 7 ఎకరాల 10 గుంటల భూమి ఉంది అందులో జనప్రియ అపార్ట్‌మెంట్‌ నిర్మిస్తున్నారు. దీనికి సమీ పంలో ప్రభుత్వ భూమి నాలా ఉంది. ఇక్కడ దాదాపు 20గుంటల భూమి కబ్జాకు గురైనట్టు ఆరోపణలు వ చ్చాయి. దీంతో హుటాహుటిన రెవిన్యూ యంత్రాం గం శుక్రవారం సర్వే చెప్పటింది. సంబంధిత ఇరిగేషన్‌ అధికారులు లేకపోవడంతో వాయిదా పడింది. అనంత రం మండల అధికారి సర్వేయర్‌ సాయి కష్ణ మాట్లాడు తూ.. వారం రోజుల్లో మరో మారు సర్వే చేసి ఒక వేల ప్రభుత్వ భూమి కబ్జాకి గురై ఉంటే ఎలాంటి నోటీసు లూ ఇవ్వకుండానే చట్టపరమైన చర్యలు తీసుకుంటా మని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఐ కష్ణ, సర్వే అధికారులు పాల్గొన్నారు.