అసరాతో భరోసా..

నవతెలంగాణ -బెజ్జంకి
తెలంగాణ రాష్ట్రంలోని వయో వృద్ధులు, ఒంటరి మహిళలు,వికలాంగులకు బీఆర్ఎస్ ప్రభుత్వం అందజేస్తున్న అసరా భరోసాగా నిలుస్తుందని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని స్థానిక సత్యార్జునా గార్డెన్ యందు నూతన అసరా లబ్ధిదారులకు దృవపత్రాలను, కల్యాణ లక్ష్మి చెక్కులను, జీవో 58 క్రమబద్ధీకరణ పత్రాలను లబ్ధిదారులకు ఎమ్మెల్యే రసమయి అందజేశారు.ఎంపీపీ నిర్మల,జెడ్పీటీసీ కవిత,సర్పంచ్ మంజుల,ఎంపీటీసీ శారధ, అయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.