గ్రామీణ తపాల బీమాతో కుటుంబాలకు దీమా ఏర్పడుతుందని సబ్ డివిజన్ ఇన్స్పెక్టర్ దిలీప్ కుమార్ పేర్కొన్నారు. మండలంలోని రాజుర గ్రామంలో నిర్వహించిన తపాల మేళాలో ఖాతాదారులకు పలు రకాల ప్రమాద భీమలపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. అతితక్కువ ప్రీమియంతో తపాల శాఖలో కేంద్ర ప్రభుత్వం రూ. 10 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు ప్రమాద బీమా సౌకర్యం కల్పించినట్లు ఆయన తెలిపారు. ఆడపిల్లల కోసం సుకన్య సమృద్ధి, యువకుల కోసం పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ సౌకర్యాలు కల్పించినట్లు ఆయన పేర్కొన్నారు. అర్హులు వెంటనే బీమా చేయించుకొవాలని రాజుర బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అనురాధ తెలిపారు. ఈ కార్యక్రమంలో విడిసి చైర్మన్ దాసరి ప్రవీణ్ , మెయిల్ వర్సర్ నరేష్ కుమార్ , ఐపిపిబి మేనేజర్ మంగ కళ్యాణ్ , గ్రామస్తులు
పాల్గొన్నారు.