రైతు బీమా పథకానికి దరఖాస్తుల స్వీకరణ..

నవతెలంగాణ – నాగిరెడ్డిపేట్

రైతు బీమా పథకానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు నాగిరెడ్డిపేట్ మండల వ్యవసాయ అధికారి విజయ శేఖర్ శనివారం తెలిపారు. కొత్తగా పట్టాదారు పుస్తకం పొంది ధరణి పోరాటంలో రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకొని ఆర్ఎ ఓ స్ ఆర్ పట్టాలు పొందిన 18 నుంచి 59 ఏళ్లు వయసు ఉన్న రైతులు రైతు బీమా పథకాన్ని కి దరఖాస్తు చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి తెలిపారు. రైతు పట్టా పాస్ పుస్తకం, ఆధార్ కార్డు,  జిరాక్స్ నామిని ఆధార్ కార్డు జిరాక్స్ రైతు బీమా దరఖాస్తు ఫారం దరఖాస్తులను రైతు స్వయంగా వెళ్లి సంబంధిత ఆగస్టు 15వ తేదీలోగా అందజేయాలని సూచించారు. ఇంతకుముందు నమోదు చేసుకున్న రైతులు ఎవరైనా సవరణలు ఉంటే సరి చేసుకోవాలని ప్రమాదవశాత్తు నామిని చనిపోయిన కొత్త నామిని మార్పు కోసం వ్యవసాయ విస్తరణ అధికారి వద్ద దరఖాస్తు చేసుకోవాలన్నారు.  పట్టాదారు పుస్తకం ఉండి ఇంతకుముందు నమోదు చేసుకొని రైతులు కూడా పూర్తి వివరాలతో సంబంధిత ఈవోను సంప్రదించాలని మండల వ్యవసాయ అధికారి విజయ శేఖర్ తెలిపారు.