స్పాట్ అడ్మిషన్ లకు దరఖాస్తుల స్వీకరణ

నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సు లలో 2024-25 సంవత్సరానికి ప్రథమ సంవత్సరంలో అడ్మిషన్ల  కోసం మిగిలిపోయీన సీట్ల భర్తీ  కోసం అర్హులైన అభ్యర్థులు నేటి నుండి ఈ నెల 11 వరకు స్పాట్ అడ్మిషన్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపాల్ సిహెచ్ నరసింహారావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 12న ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలకు పర్సనల్ సర్టిఫికెట్లతో హాజరు కావాలని కోరారు. స్పాట్ అడ్మిషన్   సీటు పొందినవారు  ప్రభుత్వం నిర్ణయించిన ఫీజు చెల్లించి తమ అడ్మిషన్ పొందాలని తెలిపారు.  దరకాస్తు ఫారం, పూర్తి వివరాల కోసం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ను నేరుగా సంప్రదించాలని తెలిపారు.