రుణమాఫీపై దరఖాస్తుల స్వీకరణ..

Acceptance of loan waiver applications– భారీగా వస్తున్న దరఖాస్తులు..
నవతెలంగాణ – డిచ్ పల్లి
పంట రుణాల మాఫీకి సంబంధించి రైతుల నుండి దరఖాస్తులు స్వీకరించేందుకు గాను ఆయా మండలాల వారీగా నోడల్ అధికారులను నియమించి వారి ద్వారానే మాఫీ కానీ రైతుల నుంచి దరఖాస్తులను డిచ్ పల్లి,ఇందల్ వాయి నోడల్ అధికారులు యం సూద మాధురి, శ్రీకాంత్ కుమార్ లు అద్వర్యంలో దరఖాస్తులను స్వీకరించారు. డిచ్ పల్లి మండలంలోని నడిపల్లి రైతు వేదికలో, ఇందల్ వాయి మండలంలోని ఇందల్ వాయి గ్రామంలోని రైతు వేదికలో రుణమాఫీ కాని రైతులు తమ రూణమఫీ వివరాలను వ్యవసాయ విస్తరణ అధికారులు రైతులకు వివరిస్తూ అవసరమైన వాటిని జిరక్స్ లో రూపం లో స్వీకరిస్తున్నారు. ప్రభుత్వం నుండి పూర్తిస్థాయిలో రుణమాఫీకి సంబంధించిన వీధి విధానాలు రాకపోవడంతో వారందరితో త్వరలోనే పూర్తిస్థాయిలో రైతులకు సమాచారం చేరవేస్తామని ఇప్పటికైతే దరఖాస్తుల రూపంలో స్వీకరిస్తున్నట్లు నోడల్ అధికారులు నవ తెలంగాణతో వివరించారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారులు ప్రకాష్ గౌడ్, సతీష్, రమాకాంత్,  మండల రెవెన్యూ అధికారి మోహన్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.