హాలియా సీఐగా రాఘవరావు బాధ్యతల స్వీకరణ

నవతెలంగాణ – హలియా 
హాలియా నూతన సీఐగా రాఘవరావు సోమవారం పదవి బాధ్యతలను స్వీకరించారు. గతంలో ఇక్కడ పనిచేసిన గాంధీ నాయక్ మహబూబ్ నగర్ జిల్లాకు బదిలీ కాగా, శాలిగౌరారం సీఐగా పనిచేస్తున్న రాఘవరావు బదిలీపై ఇక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హాలియా సర్కిల్ పరిధిలో శాంతి భద్రతల సమస్యల కోసం కృషి చేస్తానని తెలిపారు.