
ఉద్యోగులు సేవా భావంతో పనిచేస్తే మంచి గుర్తింపు ఉంటుందని బీజేపీ మహిళా మోర్చా అసెంబ్లీ కో కన్వీనర్ సిరం సుష్మ రెడ్డి అన్నారు. బైంసా మండలంలోని దేగాం గ్రామంలో బదిలీపై వెళ్లిన ఆరోగ్య సిబ్బందిని సన్మానించిన సందర్భంగా మాట్లాడారు. అదేవిధంగా ఇక్కడికి బదిలీపై వచ్చిన వారిని సత్కరించారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ ఆరోగ్యపరంగా సూచనలు ఇవ్వాలన్నారు. వర్షాకాలంలో వ్యాధులు ప్రబల కుండా చూడాల్సిన బాధ్యత ఉందన్నారు. కార్యక్రమంలో బిజెపి నాయకులు రామకృష్ణ, గంగాధర్ తో పాటు ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.