ప్రజలకు సేవ చేస్తే గుర్తింపు..

నవతెలంగాణ-కొనరావుపేట : ప్రజలకు సేవ చేస్తే ప్రజా ప్రతినిధులకుగుర్తింపు ఉంటుందని ఎంపీటీసీ యాస్మిన్ పాషా అన్నారు శుక్రవారం మండలంలోని బావు సాయి పేట గ్రామంలో ఎంపీటీసీ పదవి ముగింపు సందర్భంగా ఆమెకు గ్రామస్తులు ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నాయకులను ప్రజలు గుర్తిస్తేనే నాయకులకు పదవులు వస్తాయని పదవి ఉన్న లేకున్నా ప్రజలతో ఉండి ప్రజా సమస్యల పరిష్కరిస్తేనే నాయకునికి గుర్తింపు వస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఈరోజు పాషా గ్రామస్తులు నాయకులు యువకులు పాల్గొన్నారు.