ఉత్తమ ర్యాంకులను సాధించినప్పుడే సమాజంలో గుర్తింపు

– పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఈ.శంకర్

నవతెలంగాణ – రెంజల్
విద్యార్థులు కష్టపడి ఇష్టంతో చదివినప్పుడు వారికి ఉత్తమ ర్యాంకులు వచ్చే అవకాశం ఉందని నీల పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఇ ల్తెపు శంకర్ స్పష్టం చేశారు. బుధవారం రెంజల్ మండలం నీల జిల్లా పరిషత్ పాఠశాల, కందకుర్తి పాఠశాలల్లో పదవ తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించినప్పుడే తల్లిదండ్రులకు, గురువులకు, పాఠశాలకు గుర్తింపు వస్తుందని ఆయన స్పష్టం చేశారు. అనంతరం పాఠశాలలోని విద్యార్థిని విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకర్షించాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శంకర్, కందకుర్తి పాఠశాల ప్రధానోపాధ్యాయులు అబ్దుల్ కరీం, ఉపాధ్యాయులు అబ్బయ్య, శ్రీనివాస్, ఆనంద్, కృష్ణారెడ్డి, గులాం హైమద్, తాహెర్, కిషోర్, అపర్ణ, తదితరులు పాల్గొన్నారు.