నవతెలంగాణ – పెద్దవంగర
ఉపాధ్యాయులు అంకిత భావంతో విధులు నిర్వర్తించినప్పుడే సమాజంలో వారికి ప్రత్యేక గుర్తింపు లభిస్తుందని చిట్యాల కాంప్లెక్స్ హెచ్ఎం అర్రోజు విజయ్ కుమార్ అన్నారు. చిట్యాల జెడ్పీ ఉన్నత పాఠశాలలో సుధీర్ఘ కాలంగా ఉపాధ్యాయులుగా సేవలు అందించి గెజిటెడ్ హెచ్ఎం గా పదోన్నతి పొందిన మడిపెద్ది వెంకన్న, బదిలీ అయిన ఉపాధ్యాయుడు మచ్చ సోమయ్య లను పాఠశాల ఉపాధ్యాయ బృందం శాలువాతో ఘనంగా సన్మానించారు. పాఠశాల బలోపేతం కోసం వారు అహర్నిశలుగా పని చేశారని కొనియాడారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు రమేష్, సురేందర్, శివ కుమార్, ప్రభాకర్, ఆంజనేయులు, యుగంధర్, అరుణ, గీత, కరుణ, నరేష్, సురేష్, హరిసింగ్, రాయల్, మధు, సీఆర్పీలు వేముల సంతోష్, రంగన్న తదితరులు పాల్గొన్నారు.