జిల్లా స్థాయి గణిత పాటవ పరీక్ష (టాలెంట్ పరీక్ష) లో విశేష ప్రతిభ కనబర్చి బంగారి గూడ ఆదర్శ పాఠశాలకు చెందిన విద్యార్థులు రికార్డు సృష్టించి అన్ని బహుమతులకు గెలుపొంది. “రాష్ట్ర స్థాయికి ఎంపిక కావడం అభినందనీయమని పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజశేఖర్ తెలిపారు. గురువారం వీరిని పిఆర్టియు భవన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అభినందించారు. 2024-25 విద్యా సంవత్సరానికి నిర్వహించిన ఈ ప్రతిభా పరీక్షలో హార్శ్ ప్రథమస్థాయి, ద్వితీయ స్థాయి హర్షవర్ధన్, తృతీయస్థాయి, రమ బహుమతులను కైవసం చేసుకొని రాష్ట్రస్థాయికి ఎంపికైనట్లు తెలిపారు. దింతో ఉపాధ్యాయ సిబ్బంది, ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ రాష్ట్ర స్థాయిలో కూడా రాణించాలని ఆకాంక్షించారు.