రిలీజ్‌కి ముందే రికార్డ్స్‌

షారూఖ్‌ ఖాన్, నయనతార జంటగా నటించిన చిత్రం ‘జవాన్‌’. ఈనెల 7న ప్రపంచ వ్యాప్తంగా హిందీ, తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్‌ రిలీజ్‌ అవుతోంది. ఈ నేపథ్యంలో మేకర్స్‌ ‘జవాన్‌’ అడ్వాన్స్‌ బుకింగ్స్‌ను ఓపెన్‌ చేశారు. సినిమా కోసం ఎంత ఆతతగా ఫ్యాన్స్‌, ఆడియెన్స్‌ ఎదురు చూస్తున్నారో అడ్వాన్స్‌ బుకింగ్స్‌ వస్తున్న రెస్పాన్స్‌ చూస్తేనే అర్థమవుతుంది.అడ్వాన్స్‌ బుకింగ్స్‌ విషయంలో ‘జవాన్‌’ సరికొత్త రికార్డులను క్రియేట్‌ చేస్తోంది. ఇలాంటి రికార్డ్స్‌ క్రియేట్‌ చేయటం ఓ హిస్టరీ అని ఎగ్జిబిటర్స్‌ మాట్లాడుకోవటం విశేషం. ఐనాక్స్‌ లీజర్‌ లిమిటెడ్‌, చీఫ్‌ ప్రోగ్రామింగ్‌ ఆఫీసర్‌ రాజేంద్ర సింగ్‌ జ్యాలా మాట్లాడుతూ, ‘ఈ మూవీ అడ్వాన్స్‌ బుకింగ్స్‌కి వస్తోన్న రెస్పాన్స్‌ అద్భుతంగా ఉంది. పివిఆర్‌ ఐనాక్స్‌ అడ్వాన్స్‌ బుకింగ్స్‌ ఇలాంటి హయ్యస్ట్‌ అడ్వాన్స్‌ బుకింగ్స్‌ను చూడలేదు. బుకింగ్స్‌ ఓపెన్‌ చేసిన గంటల్లోనే 1,25,000 టికెట్స్‌ అమ్ము డయ్యాయి. ‘పఠాన్‌, గద్దర్‌ 2′ కంటే ఎక్కువగా ఉంది. ఇది బాలీవుడ్‌ ఇండిస్టీకి శుభ పరిణామం’ అని చెప్పారు. ‘జవాన్‌’ చిత్రాన్ని రెడ్‌ చిల్లీస్‌ ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్‌పై అట్లీ దర్శకత్వంలో గౌరీ ఖాన్‌ నిర్మించారు. గౌరవ్‌ వర్మ ఈ సినిమాకు సహ నిర్మాత.