
నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండలంలోని మేనూర్ గ్రామ శివారు పరిధిలోగల అయ్యప్ప సన్నిధి నుండి చోరికి గురైన విగ్రహాలను రికవరీ చేయాలని శనివారం నాడు బాన్సువాడ డీఎస్పీ సత్యనారాయణకు మద్నూర్ అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో అయ్యప్ప విగ్రహాల చోరీ విషయంపై విగ్రహాల రికవారి చేయాలని వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప సేవా సమితి గురు స్వాములు హన్మ్యాండ్లు స్వామి, డిష్ రాజు, కృష్ణ పటేల్, నాందేవ్, రమేష్, పింకు, దత్తు తదితరులు ఉన్నారు.