
నవతెలంగాణ – కామారెడ్డి
కామారెడ్డి జిల్లాలో ఇప్పటివరకు సైబర్ మోసాలకు గురైన బాధితులకు పోగొట్టుకున్న సొమ్మును నగదును తిరిగి అందజేయడం జరిగిందని జిల్లా ఎస్పీ సింధు శర్మ ఒక ప్రకటనలో తెలిపారు. జనవరి 2024 లో 1930 అనే హెల్ప్‌లైన్‌ని సైబర్ నేరాల రిపోర్టింగ్ కొరకు ప్రారంభించడం జరిగినది. దాంతోపాటు ప్రతి పోలీస్ స్టేషన్ పరిదిలో సైబర్ యోధులను కూడా ఏర్పాటుచేసుకోడవడం జరిగినది. తెలంగాణ రాష్ట్రం లో టి జి సి ఎస్ బి (తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో) జిల్లాల్లో డిస్ట్రిక్ట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరోలను ఏర్పాటు చేసి వెంటనే సైబర్ హెల్ప్ లైన్ నంబర్ ద్వారా గాని వెబ్సైట్ ద్వారా గాని సైబర్ నేరాల రిపోర్టింగ్ చేయడం జరుగుతున్నదని, తద్వారా బాదితులు పోగొట్టుకున్న నగదు భద్రపరిచే అవకాశం కలదు. ఈ నెల 14 న జరిగిన లోక్ అదాలత్ ద్వారా మన జిల్లాలో సైబర్ నేరస్తుల మోసలకు గురి అయిన 64 మంది బాదితుల యొక్క రూ. 9,14,599/- బాదితులు తిరిగి పొందే విధముగా కోర్ట్ ద్వారా వివిద బ్యాంక్ అధికారులకు ఉత్తర్వులు జారి చేయడం జరిగినదన్నారు. గత లోక్ ఆధాలత్ లో 62 కేసులలో 12 లక్షలు బాదితులకు తిరిగి ఇవ్వడం జరిగినది. ఇప్పటివరకు లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించబడిన సైబర్ కేసుల వివరాలు తెలిపారు.
25 వేల లోపు నగదు మోసపోయిన కేసులు (32), 25 వేల పై బడిన నగదు మోసపోయిన కేసులు (32), మొత్తం కేసులు (64)
మొత్తం నగదు -9,14,599. సైబర్ మోసాలలో ముఖ్యంగా క్రెడిట్డె,బిట్ కార్డ్ మోసాలు, ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ మోసాలు, ఫీడెక్స్ , బ్లూ డార్ట్, కంపెనీల వలె నకిలీ కస్టమర్ కేర్ సర్వీస్ మోసాలు, ఆదాయపు పన్ను మోసాలు, ఏటీఎం కార్డ్‌ని బ్లాక్ చేయడం, పరిమితి పెంపుదల, కేవైసీ అప్‌డేషన్, పాన్ కార్డ్ లింకేజీ, కార్డ్ రీప్లేస్‌మెంట్, రివార్డ్ పాయింట్ల పేరుతో మోసగాళ్లు అమాయక ప్రజలను మభ్యపెట్టి మోసలకు గురిచేయుచున్నారు. ప్రజలందరూ ఎప్పటికప్పుడు సైబర్ మోసాగాళ్ల మోసాల తీరులు తెలుసుకొని వాటి బారీనా పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఎట్టి పరిస్తుతులలో కూడా ఏటీఎం పిన్ నంబర్ కానీ మన సెల్ ఫోన్ లకు వచ్చిన ఓటిపి లను కానీ ఎవరికి తెలియజేయరాదన్నారు. ఇప్పటి వరకు సైబర్ బాధితులు పోగొట్టుకున్న 229 కేసులలోని 33,14,895 రూపాయల నగదును తిరిగి ఇప్పించడం జరిగినదని ఆమె ప్రకటనలు తెలిపారు.