
నవతెలంగాణ – కంఠేశ్వర్
జిల్లా కేంద్రంలోని 4వ పోలీస్ స్టేషన్ పరిధిలో పోగొట్టుకున్న 7 సెల్ఫోన్లను రికవరీ చేసి బాధిత యజమానులకు అప్పగించినట్టు ఎస్ఐ ఐ శ్రీకాంత్ గురువారం తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. సెల్ఫోన్ పోగొట్టుకున్న వారి ఫోన్స్ని సిఈఐఆర్ అప్లికేషన్ ద్వారా ట్రేస్ చేసి 7 ఫోల్ఫోన్లను యజమానులకు అందజేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాలుగవ పోలీస్ స్టేషన్ సిబ్బంది, బాధిత యజమానులు తదితరులు పాల్గొన్నారు.