నీటిపారుదల శాఖలో ఏఈఈ పోస్టుల భర్తీ

– 31 నుంచి విద్యార్హత పత్రాల పరిశీలన
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
రాష్ట్ర నీటిపారుదల శాఖలో అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్ల(ఏఈఈ) పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రారంభం కానుంది. టీజీపీఎస్సీ ద్వారా ఎంపికైన అభ్యర్థుల విద్యార్హతల పత్రాలను ఈనెల 31 నుంచి సెప్టెంబరు మూడు వరకు నిర్వహించనున్నారు. ఈమేరకు ఆ శాఖ ఈఎన్సీ జి అనిల్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్‌లోని ఇర్రంమంజిల్‌ నీటిపారుదల శాఖ ప్రధాన కార్యాలయంలో ధృవపత్రాల పరిశీలన జరగనుంది. ఈనెల 31న ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు సివిల్‌ అభ్యర్థులు(మల్టీజోన్‌-1), సెప్టెంబరు రెండున మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 6:30 గంటల వరకు మెకానికల్‌(మల్టీజోన్‌-1 అండ్‌ 2), ఉదయం 9:30 గంటల మధ్యాహ్నం 1:30 గంటల వరకు ఎలక్ట్రికల్‌ అభ్యర్థులకు సర్టిఫికెట్ల పరిశీలన చేస్తారు. అలాగే ఇదే తేదీన మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 6:30 గంటల వరకు (మల్టీజోన్‌-1 అండ్‌ 2) అగ్రికల్చర్‌ అభ్యర్థుల పత్రాలను తనిఖీ చేస్తారు. ఇకపోతే సెప్టెంబరు మూడు ఉదయం 9:30 గంటల నుంచి సాయంత్రం 6:30 గంటల వరకు (మల్టీజోన్‌-1 అండ్‌ 2) సివిల్‌ అభ్యర్థుల విదార్హతలను పరిశీలిస్తారు. పదో తరగతి మెమో, ఇంటర్మీడియట్‌/డిప్లొమో సర్టిఫికెట్‌, డిగ్రీ, కమ్యూనిటీ, స్టడీ, టీజీపీఎస్సీ హాల్‌టికెట్‌, వికలాంగుల ధృవపత్రం(అర్హత ఉంటేనే), ఈడబ్ల్యూఎస్‌ సర్టిప ˜ికెట్‌(ఓరిజినల్‌) అందచేయాల్సి ఉంటుంది. అభ్యర్థులంతా విద్యార్హత, ఇతర పత్రాలకు సంబంధించి ఒక జిరాక్స్‌ సెట్‌ను సమర్పించాలని ఈఏన్సీ అనిల్‌కుమార్‌ సూచించారు. ఇతర వివరాల కోసం 9502500322, 9704314566 నెంబర్లల్లో సంప్రదించాలని గురువారం జారీ చేసిన ఆదేశాల్లో పేర్కొన్నారు.