
నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ ఉమ్మడి మండలంలోని మద్నూర్ డోంగ్లి మండలాల్లో గల ప్రభుత్వ పాఠశాలలో క్యావెంజర్స్, పి టి ఎఫ్, పోస్టులు నియమించి పాఠశాలల శుభ్రతకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కొన్ని పాఠశాలల్లో మూత్రశాలలు మరుగుదొడ్లు నిర్మాణాలు చేపట్టినప్పటికీ అలాంటి పాఠశాలల్లో మరుగుదొడ్ల శుభ్రత క్యావెంజర్స్ లేకపోవడం పాఠశాలలను శుభ్రపరిచే పీటీఎఫ్ లు లేక గదులు ఉడువలేని పరిస్థితి కొనసాగుతుందని, ప్రభుత్వ పాఠశాలలో వసతులు ఇబ్బందికరంగా ఉన్నాయని, విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం అవుతుంది. ప్రైవేటు వద్దు.. ప్రభుత్వ చదువులే ముద్దు అంటున్నా.. ప్రభుత్వం పాఠశాలల్లో ముఖ్యమైన వసతులు మరుగుదొడ్ల శుభ్రత కోసం క్యావెంజర్ల నియామకం పాఠశాలల శుభ్రత కోసం పీటీఎఫ్ ల నియామకం చేపట్టడం ముఖ్యమైన సమస్యగా తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల గదులు శుభ్రం చేయడానికి ఎవరు లేకపోవడంతో కొన్ని పాఠశాలల్లో విద్యార్థుల విద్యార్థులే ఊడ్చుకోవాల్సిన దుస్థితి కొనసాగుతోంది. మరుగుదొడ్లు శుభ్రపరచడం లేక అలాంటి సౌకర్యాలు ఉన్న ఉపయోగించుకోవడంలో ఇబ్బందికరంగా మారాయని, ఇలాంటి రెండు ముఖ్యమైన పోస్టులను ప్రభుత్వం నియమిస్తే పాఠశాలల్లో శుభ్రత ఉంటుందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం అవుతుంది.