ఎర్రజెండా రాజ్యంతోనే పేదల జీవితాల్లో వెలుగులు

Adilabad– ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలి
– సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పైళ్ల ఆశయ్య
నవతెలంగాణ-జన్నారం
భవిష్యత్లో భారతదేశంలో ఎర్రజెండా రాజ్యం వస్తేనే పేదల జీవితాల్లో వెలుగులు నింపుతుందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఫైల్లా ఆశయ్య, జిల్లా కార్యదర్శి సంకె రవి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని జ్యోతి గార్డెన్‌లో సీపీఐ(ఎం) మండల శాఖ మహాసభ నిర్వహించారు. ముందుగా మండల కేంద్రంలోని బస్టాండ్‌ నుంచి జ్యోతి గార్డెన్‌ వరకు పార్టీ కార్యకర్తలతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ముందుగా సీపీఐ(ఎం) జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచ దేశాలల్లో ఎర్రజెండా రెపరెపలాడుతుందని ఎర్రజెండా ఎక్కడ అనేవాళ్లకి శ్రీలంక ప్రజలు చూపించారన్నారు. ఇకపోతే ఎన్నికల సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆదుకోవాలన్నారు. రాబోయే రోజుల్లో సీపీఐ(ఎం) ఆధ్వర్యం ప్రజాసమస్యల పరిష్కారానికి పోరాటాలు ఉద్యమాలు నిర్వహిస్తామన్నారు. జాన్నారం మండలంలో అధికంగా గిరిజన ప్రజలు అడవులలో ఆవాసాలు చేసుకొని జీవిస్తున్నారని, వారిని అడవిలో నుంచి బయటకు పంపించే చర్యలకు ప్రభుత్వం పూనుకుందన్నారు. అడవి పై ఆధారపడి జీవిస్తున్న మేదరులను గిరిజనులపై అటవీశాఖ అధికారులు చేస్తున్న దాడులను ఆపాలన్నారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు గోమాశ ప్రకాష్‌, జన్నారం మండల కార్యదర్శి కనికారం అశోక్‌ కూకటికారి బుచ్చయ్య, కొండ గొర్ల లింగన్న, అంబటి లక్ష్మణ్‌ గుడ్ల రాజన్న పోతు విజయశంకర్‌, ఎస్కే అబ్దుల్లా, జయ ఒడిపెల్లి అంజన్న వివిధ గ్రామాలకు చెందిన పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.