
– ఘనంగా మేడే ఉత్సవాలు
నవతెలంగాణ – శంకరపట్నం
ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని శంకరపట్నం మండల కేంద్రంలో గ్రామ గ్రామాన లాల్ జెండాలను కార్మికులు కర్షకులు ఎగురవేసి పండగ వాతావరణాన్ని సృష్టించి బుధవారం మేడేను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శిపిట్టల సమ్మయ్య.సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు వెలమరెడ్డి రాజిరెడ్డి, సిఐటియు ఆటో యూనియన్ మండల అధ్యక్షుడు వంగ బిక్షపతి,హమాలి సంఘం నాయకులు బిల్డింగ్ వర్కర్స్ ల ఆధ్వర్యంలో ఎర్రజెండాలను ఎగురవేశారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి రాజిరెడ్డి, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పిట్టల సమ్మయ్య,లు మాట్లాడుతూ..దేశంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కార్పొరేట్ సంస్థల యజమానులకు ఊడిగం చేస్తున్నాయని అన్నారు. బుధవారం ప్రపంచ కార్మిక దినోత్సవం పురస్కరించుకొని ఘనంగా మేడే ఉత్సవాలను శంకరపట్నం మండలంలో కేశవపట్నం మండల కేంద్రంలో, కొత్తగట్టు, గద్దపాక, ఎరడపల్లి, మొలంగూర్, కన్నాపూర్ ,లింగాపూర్ తాడికల్, గ్రామాలతో పాటు పలు గ్రామాల్లో కార్మికులు, కర్షకులు లాల్ జెండాలు ఎగురవేసి ఘనంగా మేడే ఉత్సవాలను పండగ వాతావరణం జరుపుకున్నారు.కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కార్మిక, కర్షక,ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ,కార్పొరేట్లకు ఊడిగం చేస్తుందని,త్యాగాలు,పోరాటాలు చేసి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను యధావిధిగా కొనసాగించాలని నాలుగు లేబర్ కోడ్ లను వెంటనే రద్దు చేయాలని,కార్మిక చట్టాల పునరుద్ధరణకై దేశంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించాలని దేశాన్ని రాజ్యాంగాన్ని ప్రజలను రక్షించుకోవాలని పిలుపునిచ్చారు,అమెరికా నగరం హే మార్కెట్లో 1886 మే 1న సమ్మె చేయాలని నిర్ణయించిన ప్రపంచ కార్మికుల సమైక్య సోషలిస్టు మరియు కార్మిక సంఘాల సమ్మె హే మార్కెట్లో భారీ నిరసన ప్రదర్శన ఎనిమిది గంటల పరిధినంకై కదం తొక్కిన కార్మికులు పెట్టుబడిదారులు,వారి గుండాలు,పోలీసులు జరిపిన తుపాకుల కాలుపులో చనిపోయిన వారి రక్తం తలసి ఎగిరిసిన ఎర్రజెండే మేడే అని అన్నారు.