రెడ్డి సామాజిక వర్గాన్ని పదేపదే దూషిస్తున్నందున చింతపండు నవీన్ ఎలియాస్ తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ ఫై బుధవారం స్థానిక పసర పోలీస్ స్టేషన్లో మండల రెడ్డి సంఘం ఆధ్వర్యంలో ఫిర్యాదు చేసినట్లు సంఘం అధ్యక్షుడు సూదిరెడ్డి జనార్దన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ వరంగల్ సభలోను ఇతర మీడియా సంస్థలతో మాట్లాడుతున్న క్రమంలో రెడ్డి సామాజిక వర్గం పై అసభ్యకర పదజాలాన్ని వాడినందున, 10% రిజర్వేషన్లపై సుప్రీం తీర్పుకు వ్యతిరేకంగా గౌరవప్రదమైన ఎమ్మెల్సీ హోదాలో ఉండి మాట్లాడడం
తదితర కారణాలపై పసర పోలీస్ స్టేషన్ ఎస్ఐ ఏ కమలాకర్ కు ఫిర్యాదు చేయడం జరిగిందని చట్టరీత్యా చర్యలు చేపట్టాలని కోరడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు అంతిరెడ్డి సత్యనారాయణరెడ్డి రమాదేవి పూలమ్మ సమ్మక్క సంధ్యారెడ్డి యాదిరెడ్డి లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.