బాల్కత్ సుమన్ పై ఫిర్యాదు చేసిన రెడ్డి సంఘం నాయకులు

నవతెలంగాణ – మోపాల్ 

రెడ్డి సంక్షేమ సంఘం 369 గడప  తరఫున నిజామాబాద్ పట్టణ పోలీస్ స్టేషన్ ఎస్సై కి చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే భాల్కత్ సుమన్ పై కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయన తెలంగాణ రాష్ట్ర ముఖ్యంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేయడం వల్ల రెడ్డి కుటుంబాల మనోబావాలను దెబ్బతీసే విధంగా, చెప్పుతో కొడతామని అనడం కరెక్ట్ కాదని రెడ్డి సంఘాల తరపున కోరడం జరిగింది. ఈ సందర్బంగా అధ్యక్షులు నాగిరెడ్డి మాట్లాడుతూ.. తక్షణమే అయన పై చట్ట రీత్యా చర్యలు తీసుకోవాలని, తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బ తీసేవిధముగా భాహిరంగ సభలో వ్యాఖ్యణించడం పై అయన పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసామని తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు విజేందర్ రెడ్డి, అధ్యక్షులు గుడిపల్లి నాగిరెడ్డి ఉపాధ్యక్షులు గాధరి సంజీవరెడ్డి, ల్యాబ్ గంగారెడ్డి, శాతవాహన గంగారెడ్డి, సహాయ కార్యదర్శి జితేందర్ రెడ్డి  కార్యవర్గ సభ్యులు రవీందర్ రెడ్డి, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.