
రెడ్డి సంఘ సభ్యులు ఐక్యమత్యంతో ముందుకెళ్లాలని, మండల రెడ్డి సంఘ అధ్యక్షులు నాగన్నగారి నరేందర్ రెడ్డి తెలిపారు. శుక్రవారం మండలంలోని కంచర్ల గ్రామ రెడ్డి సంఘ సభ్యులు మండల రెడ్డి సంఘ సభ్యులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ రెడ్డిలలో చాలామంది పేదరికంతో బాధపడుతున్నారని, వారిని ఆదుకునేందుకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసేందుకు పార్టీలకు అతీతంగా ఐక్యమత్యంగా పోరాటం చేయాలన్నారు. అలాగే మండలంలో ఉన్న నిరుపేద రెడ్డి సంఘ సభ్యులను గుర్తించి వారిని ఆదుకునేందుకు తమ వంతుగా కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెడ్డి సంఘ మండల ఉపాధ్యక్షుడు బాపురెడ్డి, కంచర్ల గ్రామ రెడ్డి సంఘ అధ్యక్షుడు చంద్ర రెడ్డి, తాజా మాజీ ఎంపీటీసీ మోహన్ రెడ్డి, రామచందర్ రెడ్డి, స్వామి రెడ్డి, బాపురెడ్డి, మల్లారెడ్డి, రాజిరెడ్డి, మహిపాల్ రెడ్డి, కంచర్ల రెడ్డి సంఘ సభ్యులు పాల్గొన్నారు.