చౌటుప్పల్ పై భాగానికి సాగునీరు అందించాలి రెడ్డి..

Reddy should irrigate the upper part of Chautuppal.– రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్యాం ప్రసాద్ రెడ్డి
నవతెలంగాణ – చౌటుప్పల్ రూరల్
మండలంలోని కొన్ని గ్రామాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించాలని రిటైర్డ్ శ్యాం పసాద్ రెడ్డి బుధవారం అన్నారు.రిక్కల సత్తి రెడ్డి ఫంక్షన్ హాల్ ఎల్లగిరి లో మెట్టు సుదర్శన్ రెడ్డి అధ్యక్షతన కరువు ప్రాంతమైన 10 గ్రామాల ప్రజలతో సమావేశాన్ని నిర్వహించారు.దాదాపు 10 గ్రామాల ప్రజలు కరువుతో ఉన్న గ్రామాలకు సాగు నీరు సాధించడమే లక్ష్యంగా సమావేశమయ్యారు.ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ శ్యాం ప్రసాద్ రెడ్డి రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇంజనీర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు  కట్టా భగవంత రెడ్డి తెలంగాణ జల సాధన సమితి కన్వీనర్ ముఖ్య అతిథులుగా వచ్చేసి పాల్గొన్నారు.ఈ సమావేశంలో రైతులు తీవ్రరమైన ఎద్దడిలో ఉన్నామని సాగుకుకే కాక తాగు నీళ్ళు లేని పరిస్థితి ఉన్నదని ఎలాగైనా మాకు సాగు నీరు తీసుకువచ్చే లభ్యత గురించి అడిగారు. శ్యాం ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ రైతులను ఉద్దేశిస్తూ నేను గతంలో ఇరిగేషన్ అధికారిగా పని చేసాను చాలా ప్రాతంలో సర్వేలు చేసి సాగు నీరు లభ్యతలు చూపాను అని అన్నారు ఇప్పుడు మీ అందరి కోరిక మేరకు రిటైర్డ్ ఇంజనీర్లు తో సమావేశమయ్యి ఒక సర్వే నిర్వహించి లిఫ్ట్ ల ద్వారా లేకా కాలువల ద్వారా ఎక్కడి నుండి మీ ప్రాంతానికి నీళ్ళు వస్థాయో అధ్యయనం చేస్తామని అవసరమైతే మీ తరపున మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు