రెడ్డి ప్రజాప్రతినిధుల సన్మానసభను జయప్రదం చేయాలి

నవతెలంగాణ-దుబ్బాక రూరల్ : అక్టోబర్ 6న శిల్ప కలవేదికలో జరిగే రెడ్డి ప్రజా ప్రతినిధుల సన్మాన సభను జయప్రదం చేయాలని రెడ్డి జాగృతి సిద్దిపేట అర్బన్ అధ్యక్షులు ఏంగారి ఆనంద్ రెడ్డి, దుబ్బాక మండల అధ్యక్షులు రామవరం రమేష్ రెడ్డి ఒక ప్రకటన లో కోరారు.  హుజూరాబాద్‌ ఎన్నికల సమయంలో రెడ్డి కార్పొరేషన్‌ను ఏర్పాటు చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఇంతవరకు అమలు చేయలేదన్నారు. రూ.ఐదు వేల కోట్లతో రెడ్డి కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. శిల్పకళావేదిక లో రెడ్డి ప్రజా ప్రతినిధుల సన్మాన సభ మధ్యాహ్నం 3గంటల నుంచి 7వరకు జరుగుతుందని సిద్దిపేట జిల్లానుంచి అధిక సంఖ్య లో రెడ్డి బందువులు పాల్గొని విజయవంతం చేయాలనీ కోరారు. ఈ కార్యక్రమానికి  ముఖ్య అతిథులుగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,కేంద్రమంత్రి గంగపురం కిషన్ రెడ్డి, గుత్త సుఖేoదర్  రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రెడ్డి ఎమ్మెల్యే లు, రెడ్డి పార్లమెంట్, రాజ్యసభ సభ్యులు, తెలంగాణ రాష్ట్ర వివిధ కార్పొరేషన్ ల రెడ్డి చైర్మన్ లు పాల్గొననున్నట్టు తెలిపారు.