రెడ్డి సంక్షేమ సంఘ నూతన కార్యవర్గం ఎన్నిక

నవతెలంగాణ – భిక్కనూర్
మండలంలోని కంచర్ల రెడ్డి సంఘ నూతన కార్యవర్గాన్ని శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా బాపురెడ్డి, ఉపాధ్యక్షుడిగా రామ్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ మట్టే మాధవరెడ్డి, ప్రధాన కార్యదర్శిగా తిరుపతిరెడ్డి, శేఖర్ రెడ్డి, కోశాధికారిగా లక్ష్మారెడ్డి, సహాయ కార్యదర్శిగా రాజిరెడ్డిలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అలాగే గ్రామంలో రెడ్డి సంఘం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మిస్తున్న మహంకాళి ఆలయ కమిటీ చైర్మన్ గా మట్టి మైపాల్ రెడ్డి, వైస్ చైర్మన్ గా జనార్దన్ రెడ్డి లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ రెడ్డి సంఘ సభ్యులు పాల్గొన్నారు.