నవతెలంగాణ-హైదరాబాద్ : ఇది ఏఐ ఆధారిత పనితీరుని కలిగి ఉంటుంది. అంతేకాకుండా దీని ఫ్లాగ్‌షిప్ కెమెరా, చూడగానే ఆకట్టుకునే అద్భుతమైన డిజైన్, గొరిల్లా® గ్లాస్ విక్టస్ ® 2 మరియు IP68తో సాటిలేని మన్నికను కలిగి ఉంది. అన్నింటికి మించి అన్ని సెగ్మెంట్ లలో అత్యంత శక్తివంతమైన బ్యాటరీతో కూడిన స్మార్ట్ ఫోన్ కావడంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా దీన్ని ఉపయోగించుకోవచ్చు. ~ రెడ్ మి నోట్ 14 5G: ఇది లేటెస్ట్ డిజైన్, శక్తివంతమైన కెమెరా సెటప్, 120Hz అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తుంది. రెడ్ మి నోట్ 14 పనితీరులోనూ మరియు చూడ్డానికి అద్భుతంగా కన్పించే విషయంలోనూ అన్ని ఫోన్ల కంటే అద్భుతమైన అనుభవాన్ని అందిస్తుంది. ~ స్మార్ట్ స్పీకర్ మరియు రెడ్‌మి బడ్స్ 6: స్పష్టమైన సౌండ్, ఎక్కవ సేపు వచ్చే బ్యాటరీ లైఫ్ తో పాటు కస్టమైజ్ చేసిన ఆడియోను అందిస్తూ… స్మార్ట్ ఫోన్ x AIoT ఎకో సిస్టమ్ ను మరింతగా మెరుగు పరుస్తుంది. న్యూఢిల్లీ, డిసెంబరు 09, 2024 – ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్ ఫోన్ అనగానే ప్రతీ ఒక్కరికీ గుర్తుకు వచ్చే బ్రాండ్ షియోమి. గత కొన్నేళ్లుగా అద్భుతమైన స్మార్ట్ ఫోన్స్ తో వినియోగదారుల ఆదరణ చూరగొన్న షియోమి బ్రాండ్.. తాజాగా రెడ్ మి నోట్ 14 5G సిరీస్‌ను ప్రారంభించినట్లు ప్రకటించింది. ఇది మిడ్-రేంజ్ స్మార్ట్ ఫోన్ సెగ్మెంట్ లో అత్యుత్తమమైన ఫోన్. ఈ సిరీస్ లో అద్బుతమైన ఫ్లాగ్ షిప్ కెమెరా, అతిపెద్ద బ్యాటరీ మరియు అసాధారణైన మన్నికను అందిస్తుంది. అంతేకాకుండా ఈ స్మార్ట్ ఫోన్ ఏఐతో కనెక్ట్ చేయబడుతుంది. తద్వారా అత్యాధునిక అత్యుత్తమ పనితీరుని కనబరుస్తుంది. అంతేకాకుండా వినూత్న రూపకల్పనతో మొబైల్ అనుభవాలను సరికొత్త శిఖరాలకు ఎలివేట్ చేయడానికి అధునాతన కెమెరా వ్యవస్థను కూడా అందిస్తుంది. రెడ్ మి నోట్ 14 సిరీస్‌తో పాటు, షియోమి తన ఆడియో ఉత్పత్తులను మరింతగా విస్తరించింది. అందులో భాగంగా షియోమి సౌండ్ అవుట్‌డోర్ స్పీకర్ మరియు రెడ్ మమి బడ్స్ 6ని కూడా పరిచయం చేస్తోంది. ఈ కొత్త ఉత్పత్తులు ఎలాంటి ఇబ్బందులు లేని కనెక్టివిటీని అందిస్తాయి. తద్వారా స్మార్ట్ ఫోన్‌లు మరియు ఆడియో ఉత్పత్తులలో వినియోగదారులకు మెరుగైన అనుభవాన్ని అందించేందుకు సదా సిద్ధంగా ఉంది షియోమి. స్మార్ట్ ఫోన్ x AIoT ద్వారా, షియోమి స్మార్ట్ వినూత్నమైన మరియు యాక్సెస్ కలిగిన సాంకేతికతను అందించడాన్ని కొనసాగిస్తుంది. రెడ్ మి నోట్ 14 ప్రో సిరీస్ : అద్భుతమైన శక్తి, మన్నిక మరియు వినూత్న ఆలోచనలో కలయికతో రూపొందిన స్మార్ట్ ఫోన్ రెడ్ మి నోట్ 14 ప్లో + 5 G మరియు రెడ్ మి నోట్ 14 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ లో అద్భుతమైన మరియు వినూత్నమైన ఫీచర్లున్నాయి. వీటిని ప్రీమియం డిజైన్ మరియు ఇంటెలిజెంట్ ఫంక్షనాలిటీతో రూపొందించారు. రెండు మోడళ్లకు ముందు భాగంగా కార్నింగ్ ® గొరిల్లా గ్లాస్ విక్టస్ ® 2, మరియు వెనుక భాగంలో గొరిల్లా గ్లాస్ 7i ఉంచబడ్డాయి. అదే సమయంలో దుమ్ము మరియు నీటి నిరోధకత కోసం IP68 రేటింగ్‌ను కలిగి ఉన్నాయి. షియోమి హైపర్ ఓఎస్ ఆధారంగా… లైవ్ వీడియో సబ్ టైటిల్స్, భాషా అనువాదాన్ని పొందవచ్చు. అంతేకాకుండా సహజమైన కనెక్టివిటీ కోసం జెమినీ AI వంటి AI- ఆధారిత లక్షణాలను పరిచయం చేస్తుంది ఈ స్మార్ట్ పోన్. 1.5K రిజల్యూషన్‌తో అద్భుతమైన 6.67-అంగుళాల 120Hz AMOLED డిస్‌ప్లే, 3000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, డాల్బీ విజన్ మరియు డాల్బీ అట్మోస్ అద్బుతమైన విజువల్స్ మరియు అకౌస్టిక్‌లను అందిస్తుంది. రెడ్ మి నోట్ 14 ప్రో 5G మెరుగైన ఎర్గోనామిక్స్ ఒక సొగసైన, వక్ర ప్రదర్శనతో అనుభవాన్ని మరింత మెరుగుపరుస్తుంది. రెండు మోడళ్లకు ఇప్పటికే బలమైన పునాది ఉన్నప్పటికీ… రెడ్ మి నోట్ 14 ప్రో+ 5G స్మార్ట్ ఫోన్‌లో షియోమి అతిపెద్ద బ్యాటరీని అందించింది. 90W హైపర్‌ఛార్జ్ టెక్నాలజీతో పాటు దీర్ఘకాలిక శక్తి కోసం 6200mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ ఫ్లాగ్‌షిప్ 50MP లైట్ ఫ్యూజన్ 800 కెమెరాను కలిగి ఉంది. ఇందులో సూపర్ OIS ఉండడం వల్ల తక్కువ-కాంతిలోనూ అద్భుతమైన చాలా షార్ప్ షాట్ లను తీసుకోవచ్చు. డ్రమాటిక్ విజువల్స్ కోసం 8MP సోనీ అల్ట్రా-వైడ్ కెమెరా మరియు 50MP 2.5X టెలిఫోటో కెమెరాతో అద్భుతమైన పోర్ట్రెయిట్‌లను కలిగి ఉంటుంది ఈ స్మార్ట్ ఫోన్. రెడ్ మి నోట్ 14 ప్రో 5Gలో శక్తివంతమైన 50MP సోనీ LYT-600 సెన్సార్ ఉంది. అద్భుతమైన, చాలా క్లియర్ ఫోటోల కోసం AI Bokeh మరియు డైనమిక్ షాట్స్ వంటి AI-మెరుగైన ఫీచర్‌లతో ప్రో-లెవల్ ఫోటోగ్రఫీని అందిస్తుంది. 5500mAh బ్యాటరీ మరియు 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో, రెడ్ మి నోట్ 14 ప్రో 5G రోజంతా దీర్ఘకాలిక పనితీరును అందిస్తుంది. రెండు మోడల్ లు 4 ఏళ్ల సాఫ్ట్ వేర్ అప్‌డేట్‌లతో వస్తాయి. తద్వారా రాబోయే రోజుల్లో కూడా అప్ డేట్ వెర్షన్ ను అందుకుంటూ వినయోగదారు అనుభవాన్ని మరింతగా పెంచేందుకు షియోమి కృషి చేస్తోంది. రెండూ మోడల్ ఫోన్లు.. స్టైల్ మరియు మన్నిక కోసం రూపొందించబడ్డాయి. రెడ్ మి నోట్ 14 ప్రో+ 5G స్పెక్టర్ బ్లూ, టైటాన్ బ్లాక్ మరియు ప్రత్యేక ఫాంటమ్ పర్పుల్ వేగన్ లెదర్ ఎడిషన్‌లో లభిస్తుంది. అయితే రెడ్ మి నోట్ 14 ప్రో 5G మాత్రం ఐవీ గ్రీన్, టైటాన్ బ్లాక్ లో అందుబాటులో ఉంటాయి. అన్నింటికి మింతి తొలిసారిగా ప్రో మోడల్ డ్యూయల్ టోన్ వీగన్ లెదర్ ఫాంటమ్ పర్పుల్ ఎడిషన్ లో కూడా వినియోగదారుల కోసం అందుబాటులో ఉంటుంది. రెడ్ మి నోట్ 14 5 జీ : ప్రతీ రోజు అద్భుతం, ఆత్యద్భుతం రెడ్ మి నోట్ 14 5G సొగసైన డిజైన్ మరియు శక్తివంతమైన పనితీరును అందిస్తుంది. ఎలాంటి ఇబ్బందులు లేని అనుభవాన్ని అందిస్తుంది. అందులో ఉండే స్టైలిష్ కెమెరా డెకో, కర్వ్డ్ బాడీ మరియు మిస్టిక్ వైట్, ఫాంటమ్ పర్పుల్ మరియు టైటాన్ బ్లాక్ వంటి సొగసైన రంగు ఎంపికలతో వస్తుంది. ఇది ప్రత్యేకమైన ఫోన్. 6.67-అంగుళాల AMOLED డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 2100 nits పీక్ బ్రైట్ నెస్ తో అద్భుతమైన విజువల్స్ ను అందిస్తుంది. ఏ లైట్ లో అయినా శక్తివంతమైన స్పష్టతను నిర్ధారిస్తుంది. ఇన్-డిస్ ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ కూడా పరికరాన్ని అన్‌లాక్ చేయడం వేగంగా మరియు మరింత సౌకర్యవంతంగా మారుస్తుంది. ఇక జీవితంలో జరిగే చిన్న క్షణాల నుంచి చాలా అపురూపమైన ఘట్టాల వరకు అన్నింటికి అద్భుతంగా క్యాప్చర్ చేస్తుంది ఈ స్మార్ట్ ఫోన్. అందుకోసం ఇందులో… 50MP Sony LYT-600 సెన్సార్, 8MP అల్ట్రా-వైడ్ లెన్స్ మరియు మాక్రో లెన్స్ ఉన్నాయి. తద్వారా మీరు ప్రతిసారీ అద్భుతమైన చాలా షార్ప్ షాట్ లను తీసుకోవచ్చు. అంతేకాకుండా 5110mAh బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో ఈ స్మార్ట్ ఫోన్ మరింత వేగంగా ఛార్జ్ అవుతుంది. ఇక సౌండ్ క్వాలిటీ విషయానికి వస్తే.. Dolby Atmosతో డ్యూయల్ స్టీరియో స్పీకర్లు మీ మల్టీమీడియా అనుభవాన్ని తదుపరి స్థాయికి తీసుకువెళతాయి. షియోమి ఉత్పత్తులను స్థానికంగా తయారు చెయ్యాలనే నిబద్ధతను మరోసారి నిరూపిస్తూ… రెడ్ మి నోట్ 14 ప్రో + 5G, రెడ్ మి నోట్ 14 ప్రో 5G మరియు రెడ్ మి నోట్ 14 5G… మేక్ ఇన్ ఇండియా లో భాగంగా భారతదేశంలోనే రూపొందించబడ్డాయి. షియోమి సౌండ్ ఔట్ డోర్ స్పీకర్ : ఏ క్షణానికి అయినా అద్భుతమైన సౌంచ్ షియోమి సౌండ్ అవుట్‌డోర్ స్మార్ట్ స్పీకర్.. 2024కు సంబంధించి రెడ్ డాట్ అవార్డు విజేతగా నిలిచింది. ఇది శక్తివంతమైన పనితీరుతో సొగసైన మరియు పోర్టబుల్ డిజైన్‌ను మిళితం చేస్తుంది. మీరు చిన్న సమావేశాన్ని నిర్వహిస్తున్నా, కఠినమైన మార్గాల్లో హైకింగ్ చేసినా లేదా పూల్ దగ్గర విశ్రాంతి తీసుకుంటున్నా, దాని బహుముఖ డిజైన్ సౌండ్ క్వాలిటీపై రాజీ పడకుండా సులభంగా కదలికను అందిస్తుంది. డ్యూయల్ సబ్ వూఫర్‌తో కూడిన శక్తివంతమైన 30W డ్రైవర్… చాలా క్లియర్ గా ఉండే ఆడియోను ఎప్పుడైనా, ఎక్కడైనా అందిస్తుంది. దుమ్ము మరియు నీటి నిరోధకత కోసం IP67 రేటింగ్‌తో కేవలం 597g బరువుతో, ఎలాంటి వాతావరణానికి అయినా సిద్ధంగా ఉంటుంది ఈ స్మార్ట్ ఫోన్. రోజువారీ పర్యటనలు లేదా పొడిగించిన విహారయాత్రలకు పర్ఫెక్ట్ గా సూటవుతుంది. ఇందులో ఉండే 2600mAh బ్యాటరీ గరిష్టంగా 12 గంటల ప్లేబ్యాక్‌ను అందిస్తుంది. దీంతోపాటు వేగవంతమైన ఛార్జింగ్ మిమ్మల్ని కేవలం 2.5 గంటల్లో పూర్తి శక్తిని అందిస్తుంది. పెద్ద పెద్ద మీటింగ్ ల కోసం, బ్లూటూత్ 5.4 గరిష్టంగా 100 స్పీకర్లతో జత చేయడాన్ని అనుమతిస్తుంది, ఇది సరౌండ్ సౌండ్ అనుభవాన్ని సృష్టిస్తుంది. రెడ్ మి బడ్స్ 6 : ప్రతీ లైఫ్ స్టైల్ కు ప్రీమియం సౌండ్ మరియు స్మార్ట్ ఫీచర్స్ రెడ్ మి బడ్స్ 6.. ఈ సెగ్మెంట్ లో ఫస్ట్ డ్యూయల్-డ్రైవర్ సిస్టమ్‌ను కలిగి ఉంది. ఇందులో 12.4ఎమ్ఎమ్ డైనమిక్ టైటానియం డ్రైవర్ మరియు రిచ్ బాస్ మరియు స్ఫుటమైన హైస్ కోసం 5.5ఎమ్ఎమ్ మైక్రో పైజోఎలెక్ట్రిక్ డ్రైవర్‌ను యాడ్ చేశారు. 49dB హైబ్రిడ్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్‌తో, 99.6% పైగా బయటి సౌండ్ ని నిరోధిస్తాయి. ప్రయాణంలో, పనిలో లేదా విశ్రాంతిగా ఏ వాతావరణంలోనైనా లీనమయ్యే ఆడియో అనుభవాన్ని అందిస్తాయి. డ్యూయల్ డివైస్ పెయిరింగ్ అనేది పరికరాల మధ్య ఎలాంటి ఇబ్బందు లు లేకుండా మారేందుకు అనుమతిస్తుంది, అయితే AI ENC మరియు క్వాడ్-మైక్ సిస్టమ్ గాలులతో కూడిన పరిస్థితులలో లేదా కదలికలో కూడా స్పష్టమైన కాల్‌లను నిర్ధారిస్తాయి. అవుట్‌డోర్ మీటింగ్‌లు, వర్కౌట్ కాల్‌లు లేదా జాగ్‌లకు అనువైనది. కేస్‌ని ఉపయోగించి గరిష్టంగా 42 గంటలపాటు ఉపయోగించవచ్చు. ఒకే ఛార్జ్ పై గరిష్టంగా 10 గంటల ప్లేబ్యాక్‌తో, రెడ్ మి బడ్స్ 6 సుదీర్ఘ ప్రయాణాలకు, ప్రయాణాలకు లేదా రోజంతా వినియోగానికి అనువైనది. వాటిని ఏ జీవనశైలికైనా అంతిమ ఆడియో సహచరుడిగా మారిపోతుంది. ధర మరియు అందుబాటు వివరాలు: రెడ్ మి నోట్ 14 ప్రో + 5G స్మార్ట్ ఫోన్ 8GB+128GB వేరియంట్ లో రూ. 29,999లకు అందుబాటులో ఉంది. అలాగే 8GB+256GB వేరియంట్… రూ. 31,999లకు అందుబాటులో ఉంది. 12GB+512GB వేరియంట్ రూ. 34,999లకు అందుబాటులో ఉంటుంది. రెడ్ మి నోట్ 14 5G సిరీస్ డిసెంబరు 13, 2024 నుంచి Mi.com, Flipkart.in మరియు Xiaomi రిటైల్ స్టోర్‌లు మరియు అధీకృత రిటైల్ భాగస్వాములలో అందుబాటులో ఉంటాయి. ఇక రెడ్ మి నోట్ 14 ప్రో 5G 8GB+128GB వేరియంట్ విషయానికి వస్తే… ఈ స్మార్ట్ ఫోన్ రూ. 23,999 వద్ద అందుబాటులో ఉంది. అలాగే 8GB+256GB వేరియంట్ ధరని రూ. 25,999గా నిర్ణయించారు. ,రెడ్ మి నోట్ 14 5G సిరీస్ డిసెంబరు 13, 2024 నుండి Mi.com, Flipkart.in మరియు Xiaomi రిటైల్ స్టోర్‌లు మరియు అధీకృత రిటైల్ భాగస్వాములలో అందుబాటులో ఉంటుంది. మొట్టమొదటిసారిగా, రెడ్‌మి నోట్ ప్రో సిరీస్ వినియోగదారులు కొనుగోలు చేసేందుకు వీలుగా ఫ్లిప్‌కార్ట్ లో కొన్ని నిమి,లు అందుబాటులో ఉంటుంది. రెడ్ మి నోట్ 14 5G 6GB+128GB వేరియంట్ ధరని రూ. 17,999 గా నిర్ణయిస్తే… 8GB+128GB వేరియంట్ రూ.18,999 వద్ద వినియోగదారులకు అందుబాటులో ఉంది. ఇక 8GB+256GB వేరియంట్ ధర ఆఫర్ లతో కలుపుకుని రూ. 20,999గా నిర్ణయించారు. రెడ్ మి నోట్ 14 5G సిరీస్ డిసెంబరు 13, 2024 నుండి Mi.com, Amazon.in మరియు Xiaomi రిటైల్ స్టోర్‌లు మరియు అధీకృత రిటైల్ భాగస్వాములలో అందుబాటులో ఉంటుంది. ఇతర వివరాలు: వినియోగదారులు ఐసీఐసీఐ క్రెడిట్ మరియు డెబిట్ కార్డ్ లను ఉపయోగించి రూ. 1000 తక్షణ తగ్గింపును పొందవచ్చు. లేదా హెచ్.డి.బి. ఫైనాన్షియల్ సర్వీసెస్ నో కాస్ట్ EMI లోన్‌లపై రూ. 1000 ఎక్స్ చేంజ్ బోనస్ లేదా రూ. 1000 క్యాష్ బ్యాక్ పొందవచ్చు. రెడ్ మి బడ్స్ 6 ధరని రూ. 2,999గా నిర్ణయించారు. అయితే డిసెంబరు 13. 2024 నుండి 19 వరకు ప్రత్యేక లాంచ్ ధరతో రూ. 2,799కే అందుబాటులో ఉంటుంది. అత్యుత్తమ సౌండ్ క్వాలిటీ మరియు ఎలాంటి ఇబ్బందులు లేని కనెక్టివిటీని అందించే రెడ్ మి బడ్స్ 6… mi.com, Amazon.in మరియు Xiaomi రిటైల్‌లో అందుబాటులో ఉంటాయి. షియోమి సౌండ్ అవుట్‌డోర్ స్పీకర్ ధరనిరూ. 3,999గా నిర్ణయించారు. అయితే ప్రత్యేక లాంచ్ ఆఫర్ ధరగా రూ.3,499కే అందిస్తున్నారు. అది కూడా డిసెంబర్ 13 నుండి 19 వరకు మాత్రమే. మీ స్మార్ట్ హోమ్ అనుభవాన్ని మెరుగుపరచడానికి రూపొందించబడిన షియోమి సౌండ్ అవుట్‌డోర్ స్పీకర్ mi.com, Flipkart మరియు Xiaomi రిటైల్‌లో అందుబాటులో ఉంటుంది.