– వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్
నవతెలంగాణ-ికారాబాద్ కలెక్టరేట్
ప్రజల నుంచి వచ్చిన ప్రజా ఫిర్యాదులను పెండింగ్ ఉంచకుండా ఎపటికప్పుడు సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కల్లెక్టరేట్ సమావేశం హాలు నందు ఏర్పాటు చేసిన ప్రజా వాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి సుమారు 150 ప్రజా ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సంర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల నుంచి వచ్చిన ప్రజా ఫిర్యాదులను సంబంధిత అధికారులు సత్వరమే ప్రరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ధరణి, భూసర్వే, ఆసరా పింఛన్లకు సంబంధించిన దరఖాస్తులు ఎక్కువగా వచ్చాయని తెలిపారు. వివిధ మండలాలకు సంబంధించిన పలు గ్రామాల ప్రజలు ఇచ్చిన ఫిర్యాదులను పరిశీలించారు. ప్రజావాణి ద్వారా వచ్చిన ఫిర్యాదులను పెండింగ్ ఉంచకుండా ఎప్పటికపపుడు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్, ఇన్‌చార్జి అదనపు కలెక్టర్ సుధీర్, ఆర్డీఓ వాసు చంద్ర, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.