ముంబయి : వరుసగా ఏడు వారాలుగా పెరుగుతూ వచ్చిన విదేశీ మారకం నిల్వలు జనవరి 5తో ముగిసిన వారాంతానికి తగ్గాయి. సమీక్షా వారంలో ఫారెక్స్ రిజర్వులు 5.90 బిలియన్ డాలర్లు తగ్గి 617.30 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయని ఆర్‌బీఐ వెల్లడించింది. విదేశీ కరెన్సీ రూపంలో ఉన్న ఆస్తుల విలువ తరిగిపోవడానికి ప్రధాన కారణమని పేర్కొంది. పసిడి రిజర్వులు కూడా 839 మిలియన్ డాలర్లు తగ్గి 47.49 బిలియన్ డాలర్లకు తగ్గాయి.