ముంబయి : వరుసగా రెండు వారాలు పెరిగిన విదేశీ మారకం నిల్వలు.. ఒక్క సారిగా పడిపోయాయి. ఫిబ్రవరి 9తో ముగిసిన వారంలో మారకం నిల్వలు 5.24 బిలియన్ డాలర్లు తరిగిపోయి 617.23 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయని రిజర్వు బ్యాంక్ వెల్లడించింది. అంతక్రితం వారంలో రిజర్వులు 622.5 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో యూరో, పౌండ్, యెన్ కరెన్సీలు తీవ్ర ఆటుపోటులకు గురి కావడంతో ఫారెక్స్ రిజర్వులు తగ్గడానికి కారణమని ఆర్‌బిఐ తెలిపింది.