తగ్గిన ఇండియన్‌ బ్యాంక్‌ ఎన్‌పిఎలు

Reduced Indian Bank NPAs– క్యూ3లో రూ.2,852 కోట్ల లాభాలు
హైదరాబాద్‌: ప్రభుత్వ రంగంలోని ఇండియన్‌ బ్యాంక్‌ 2024-25 డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికం (క్యూ3)లో 34.58 శాతం వృద్ధితో రూ.2,852 కోట్ల నికర లాభాలు సాధించింది. ఇంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.2,119.35 కోట్ల లాభాలు నమోదు చేసింది. ఇదే సమయంలో రూ.5,814.19 కోట్లుగా ఉన్న నికర వడ్డీ ఆదాయం.. గడిచిన క్యూ3లో 10.32 శాతం పెరిగి రూ.6,414.72 కోట్లకు చేరింది. 2024 డిసెంబర్‌ ముగింపు నాటికి 3.26 శాతానికి తగ్గాయి. ఇంతక్రితం ఏడాది కాలానికి 4.47 శాతం జిఎన్‌పిఎ నమోదయ్యింది. నికర నిరర్ధక ఆస్తులు 0.53 శాతం నుంచి 0.21 శాతానికి పరిమితమయ్యాయి. బుధవారం బిఎస్‌ఇలో ఇండియన్‌ బ్యాంక్‌ షేర్‌ 5.84 శాతం పెరిగి రూ.544.70 వద్ద ముగిసింది.