– శ్రీరామ్ మొబిలిటీ రిపోర్ట్
హైదరాబాద్ : ప్రస్తుత ఏడాది జూన్‌లో దేశంలోని పలు కీలక రూట్లలో ట్రక్కు అద్దెలు తగ్గాయని, మరికొన్ని చోట్ల యథాతథంగా నమోదయ్యాయని శ్రీరామ్ మొబిలిటీ బులిటెన్‌లో పేర్కొంది. ముంబయి-కోల్‌కత్తా, బెంగళూరు- ముంబయి రూట్లలో ట్రక్కు అద్దెలు వరుసగా 2.6 శాతం, 1.6 శాతం చొప్పున తగ్గాయని తెలిపింది. మరోవైపు వాడేసిన వాణిజ్య ట్రక్ ధరల్లో పెరుగుదల చోటు చేసుకుందని తెలిపింది. ఏడాదికేడాదితో పోల్చితే 31-36 టన్నుల విభాగంలో 43 శాతం, 1.5-2 టన్నుల విభాగంలో 38 శాతం పెరుగుదల నమోదయ్యిందని వెల్లడించింది.