బెంగళూరు : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25) సెప్టెంబర్‌తో ముగిసిన ద్వితీయ త్రైమాసికం (క్యూ2) లో ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ నికర లాభాలు 23 శాతం తగ్గి రూ.233 కోట్లుగా నమోదయ్యాయి. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.328 కోట్ల లాభాలు సాదించింది. గడిచిన క్యూ2లో బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం (ఎన్‌ఐఐ) 9.5 వాతం పెరిగి రూ.944 కోట్లుగా చోటు చేసుకుంది. బ్యాంక్ స్థూల రుణ పుస్తకం 14 శాతం పెరిగి రూ.30,344 కోట్లకు చేరింది. స్థూల నిరర్థకా స్తులు 2.5 శాతంగా, నికర ఎన్‌పీఏలు 0.6 శాతంగా నమోదయ్యాయి. గడిచిన త్రైమాసికంలో మొండి బాకీలకు చెందిన రూ.140 కోట్ల రుణాలను రద్దు చేసింది.