– రియల్ వ్యాపారులకు, ప్రజాప్రతినిధులకు ఇవ్వొద్దు
– 5 ఎకరాలకే పరిమితం చేయాలి
– జిల్లా రైతుల్లో భిన్నభిప్రాయాలు
– ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 23న ప్రజాభిప్రాయ సేకరణ
రైతు భరోసా పథకంపై ప్రభుత్వం రైతుల నుంచి అభిప్రాయాలు సేకరిస్తోంది. ఈ అభిప్రాయాలతోనే రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా విధివిధానాలు రూపొందించనుంది. గత ప్రభుత్వం భూమి ఉన్న ప్రతి రైతుకూ సీజన్ ఎకరాకు రూ.5వేల చొప్పున ఆర్థిక సాయం అందించింది. అయితే దీంతో కొంత నగదు దుర్వినియోగమైట్టు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించింది. రైతు బంధు పథకాన్ని రైతు భరోసాగా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం విధివిధానాల కోసం రూపకల్పన చేస్తోంది. సాగు చేసే రైతుకే భరోసా పథకం లబ్ది చేకూరేలా పక్క ప్రణాళికతో అడుగులు వేస్తోంది.
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
రంగారెడ్డి జిల్లాలో 3 లక్షల 25 వేల 216 మంది రైతులకు గాను రూ.340 కోట్ల, వికా రాబాద్ జిల్లాలో 2 లక్షల 20 వేల 297 మంది రైతులకు రూ.184 కోట్ల నిధులను గత ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేశారు. అర్హులైన రైతులకు మాత్రమే కాకుండా వందల ఎకరాల భూములు ఉన్న పెద్దలకు, బడా నాయకులకు, భూస్వాములకే కాకా ఫామ్ ల్యాండ్‌లు, రిసార్ట్స్ పేరుతో ద్వారా వ్యాపారాలు చేసే చాలా మంది వ్యాపారుల ఖా తాల్లో నిధులు జమ చేశారు. నూతన విధివిధా నాలతో రైతు భరోసా నిధుల శాతం 60శాతానికి తగ్గే అవకాశం ఉందని నిపుణులు వివరిస్తున్నారు. అందుకే రైతు భరోసా పథకానికి ప్రత్యేక నిబం ధనలు పెట్టి అర్హులైన రైతులకు మాత్రమే రైతు భరోసా కింద ఎకరాకు ఏడాదికి రూ.15 వేలు ఇ వ్వాలనే దిశగా అడుగులు వేస్తూ జిల్లా వ్యవసాయ శాఖ అధికారులతో రైతుల అభిప్రాయం సేకరణ సర్వే చేయించారు. వికారాబాద్ జిల్లాలో రైతుల అ భిప్రాయం ప్రకారం 5 ఎకరాల పొలం ఉన్న రైతు లకే రైతు భరోసా పథకం వర్తింప చేయాలని, ఒక వేళ అంతకంటే భూమి ఎక్కువగా ఉన్న రైతులు ఉంటే వారికి కేవలం 5 ఎకరాల వరకు మాత్రమే రైతు పెట్టుబడి సహాయం ఇవ్వాలని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగం చేసే కుటుంబాలకు రైతు భరోసా పథకం అవసరం లేదని కూడా కొందరు రైతులు తమ అభిప్రాయా న్ని వ్యక్తం చేసినట్టు పూర్తి నివేదిక ప్రభుత్వానికి పంపినట్టు వ్యవసాయ అధికారులు తెలిపారు. ఇక రంగారెడ్డి జిల్లాలో మాత్రం పూర్తి భిన్న అభిప్రా యలు వెలువడుతున్నాయి.
ఇక్కడ పంట పొలాలకంటే అత్యధికంగా ఫామ్ ల్యాండ్ ఉండడం, లే అవుట్ భూములు ఎ క్కువ ఉండడంతో ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బు లు మాకు కూడా అందాలని, రైతుల లాగే అవస రమైతే వారి కంటే ఎక్కువ ట్యాక్సులు ప్రభుత్వానికి మేము కూడా కడుతున్నాం. కాబట్టి మాకు కూడా రైతు భరోసా పథకం వర్తింప చేయాలని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ నెల 23వ తేదీన ప్రభుత్వం రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో పెద్ద ఎత్తున ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టనుంది. ఇందులో రైతులతో పాటు మేధా వులు, విద్యావంతులు, రాజకీయ నాయకులు అం దరూ పాల్గొనేలా ఒక సన్నాహక సమావేశం ఏర్పా టు చేయనున్నారు. ఈ సమావేశం అనంతరం ఇన్‌చార్జి మినిస్టర్ శ్రీధర్‌బాబు ఆధ్వర్యంలో ప్రభు త్వానికి ఒక నివేదిక పంపడానికి సన్నాహాలు చేస్తు న్నట్టు తెలుస్తోంది. ఇలా పెద్ద ఎత్తున అందరి అభి ప్రాయం సేకరణ చేసిన తరువాతే రైతు భరోసా పథకానికి సంబందించిన విధి విధానాలు రూపొం దించనున్నారని తెలుస్తుంది.
5 లేదా 10 ఎకరాలకే పరిమితం…
గత ప్రభుత్వంలో అభివృద్ధిలో భాగంగా భూ సేకరణలో భూమి కోల్పోయిన వారికి, అక్కడక్కడా రోడ్లకు, ఫామ్ ల్యాండ్‌లకు సైతం రైతుబంధు వే యడంతో ప్రభుత్వ నిధులు పెద్ద మొత్తంలో దుర్వి నియోగం అయినట్టు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం చెబు తుంది. అది దృష్టిలో పెట్టుకొని ఇలాంటి తప్పు మా ప్రభుత్వంలో జరగదని భరోసా ఇస్తున్నారు. రైతుల అభిప్రాయం సేకరణలో సైతం ఇదే అభిప్రా యం వస్తుండడంతో కేవలం 5, 10 ఎకరాలుండే రైతు లకే రైతు భరోసా పథకం అమలు చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ నెలల చివరి నాటికి రైతుల అభి ప్రాయలు సేకరించి అర్హులైన రైతులు అందరికీ పె ట్టుబడి సహాయం అందించడానికి కసరత్తు చేస్తు న్నారు. ఏదిఏమైనా ఇప్పటికే విత్తనాలు పెట్టడం జరిగింది, కొన్ని జిల్లాలో సమయానికి వర్షాలు పడకపోవడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతు న్నారు. అలాంటి వారికి వీలైనంత తొందరగా పె ట్టుబడి సహాయం అందిస్తే బాగుంటుందని రైతు లు కోరుతున్నారు.
ఈ నెల 23న ప్రజాభిప్రాయం…
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని వికారాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ పరిధిలోని రైతులు, మేధా వులు, ప్రజాసంఘాలు పెద్ద ఎత్తున్న పాల్గొని అభి ప్రాయం చెప్పాలని ప్రభుత్వం భావిస్తోంది. అం దుకోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి జిల్లాల వారీగా ప్రజాభిప్రాయ సేకరణకు సభలు ఏర్పాటు చేస్తు న్నారు. అందుబాలో భాగంగానే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన సమావేశం ఈనెల 23వ తేదీన రంగారెడ్డి జిల్లా సమీకృత కలెక్టరేట్‌లో ఏర్పా టు చేయనున్నారు. ఈ సమావేశంలో మూడు జి ల్లాల కలెక్టర్లు, వ్యవసాయ అధికారులు, రైతులు ఇన్‌చార్జి మంత్రి శ్రీధర్‌బాబు నేతృత్వంలో జరగ నుంది. భారీ సంఖ్యలో రైతులు పాల్గోనేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.