విద్యాశాఖ అధికారిగా రేగ కేశవరావు బాధ్యతలు స్వీకరణ 

Rega Keshavrao assumed responsibility as Education Officerనవతెలంగాణ – తాడ్వాయి 
ములుగు జిల్లా తాడ్వాయి మండల విద్యాశాఖ అధికారిగా రేగ కేశవరావు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని మండలాలకు సీనియర్ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులకు ఎంఈవోలుగా అవకాశాలు కల్పిస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అందులో భాగంగా సీనియర్ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులుగా విధులు నిర్వర్తించిన రేగ కేశవరావు నూతన మండల విద్యాశాఖ అధికారిగా ప్రధానోపాధ్యాయుల ఆధ్వర్యంలో బాధ్యతలు స్వీకరించారు. మొదట ఉపాధ్యాయులు, విద్యార్థులు మేల తాళాలతో వారిని విద్య శాఖ భవనానికి తీసుకువచ్చి స్వాగతం పలికారు. శాలువాలు కప్పి, బోకే అందించి నూతన ఎంఈఓ కు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన విద్యాశాఖ అధికారి రేగ కేశవరావు మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి నుండి ప్రధానోపాధ్యాయులుగా, తదుపరి మండల విద్యాశాఖ అధికారిగా రావడం అనేది ఆనందంగా ఉందని అన్నారు. సకాలంలో ప్రతి పని పూర్తి చేయడం  నా లక్ష్యంగా భావిస్తున్నానని తెలిపారు. ప్రతి పాఠశాలను సందర్శించి విద్యా ప్రమాణాలను నాణ్యతలను పరిశీలించి ప్రభుత్వ కార్యక్రమాలు పాఠశాలలో 100% అమలు అయ్యేలా కృషి చేస్తానని తెలిపారు. పిల్లలకు సేవ చేయడం భగవంతుడు ఇచ్చిన గొప్ప వరంలా భావించి, వచ్చిన ఈ సదవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటానని తెలిపారు. రాబోయే రోజుల్లో విద్యా పరంగా మండలాన్ని ప్రథమ స్థానంలో వచ్చేలా చూస్తానని తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు పి శంకర్, చంద్రారెడ్డి, శ్రావంత్, తోలెం లక్ష్మయ్య, వసంతరావు, మంకిడి స్వామి, ఎల్ వనిత, బి రజిత, కె రేణుక, ఎం ఐ ఎస్ కోఆర్డినేటర్ నీలం బాబు, కంప్యూటర్ ఆపరేటర్ కోయిల సారయ్య, పిఆర్పీలు కళ్యాణి, రవి, నరేష్, మెసెంజర్ రమేష్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.