ఆళ్ళపల్లిలో పల్లె నిద్ర చేసిన రేగా

నవతెలంగాణ – ఆళ్ళపల్లి 
పినపాక నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధి రేగా కాంతారావు శుక్రవారం ఆళ్ళపల్లి మండల మండలంలో పలు గ్రామాల్లో గడప గడపకు బీఆర్ఎస్ మ్యానిఫెస్టోని వివరిస్తూ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈనెల 30వ తేదీన జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగించుకుని రాత్రి కావడంతో పలు గ్రామాలు మిగిలి ఉండడంతో ఆళ్ళపల్లి మండల కేంద్రంలో పల్లెనిద్ర చేశారు. మండలంలో మిగిలిన గ్రామాల్లో శనివారం ఎన్నికల ప్రచారం కొనసాగిస్తారని రేగా కాంతారావు తెలిపారు.