ప్రాంతీయ భాషా కంటెంట్ ఈ ఏడాది పండగ షాపింగ్ కు ఇంధనం

నవతెలంగాణ హైదరాబాద్: పండగ సీజన్ పూర్తి ఊపులో ఉండడంతో, మెటా పండగ పోకడలపై తన అధ్యయనంలో గుర్తించిన విషయాలను వెల్లడించింది. ప్రముఖ వినియోగదారు పరిశోధన ప్లాట్ఫారమ్ లో ఒకటై న కన్స్యూమర్ ఇన్ సైట్స్ ప్లాట్ఫారమ్ జీడబ్ల్యూఐ ద్వారా సెప్టెంబరులో మెటా ద్వారా నిర్వహించిన అధ్యయనం, ఈ ఏడాది పండగ షాపింగ్ పోకడ లను అర్థం చేసుకునేందుకు అవకాశం కల్పించింది. మెటాలో యాడ్స్ బిజినస్ (ఇండియా) డైరెక్టర్, హెడ్ అరుణ్ శ్రీనివాస్ మాట్లాడుతూ, “ఏఐ, క్విక్-కామర్స్ ను స్వీకరించడం, మైక్రో ఇన్ఫ్లుయెన్సర్ల వృద్ధి, ప్రాంతీయ ప్రాబల్యంతో భారతదేశంలో పండుగ షాపింగ్ పోకడలు నాటకీయంగా మారుతున్నాయని అధ్యయనం స్పష్టంగా చూపిస్తుంది. పండగ కొనుగోళ్లను ప్రభావితం చేయడంలో భాషా కంటెంట్ ప్రముఖ పాత్ర పోషిస్తోంది.