ప్రాంతీయ పార్టీలదే కీలకపాత్ర

ప్రాంతీయ పార్టీలదే కీలకపాత్ర– చింతమడకలో ఓటు హక్కు వినియోగించుకున్న కేసీఆర్‌
నవతెలంగాణ- సిద్దిపేట రూరల్‌
లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌, బీజేపీలకు ఆశించిన మేర మెజారిటీ రాదని ఈ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలే కీలక పాత్ర వహిస్తాయని మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో భాగంగా ఆయన సోమవారం తన సొంత గ్రామమైన సిద్దిపేట జిల్లా రూరల్‌ మండలంలోని చింతమడకలో కుటుంబ సభ్యులతో కలసి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎర్రవల్లి నుంచి హెలికాప్టర్‌లో ఉదయం 11:30 గంటలకు చింతమడకకు చేరుకున్నారు. అనంతరం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలోని 13వ బూత్‌లో ఓటు వేసి ప్రజలకు అభివాదం చేశారు. ఆయన వెంట మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీశ్‌ రావు, మాజీ సుడా చైర్మెన్‌ రవీందర్‌ రెడ్డి, జెడ్పీటీసీ శ్రీహరి గౌడ్‌, ఎంపీపీ శ్రీదేవి రామచంద్రరావు, సర్పంచ్‌ హంసకేతన్‌ రెడ్డి, ఉప సర్పంచ్‌ మోత్కు రవి, నాయకులు తదితరులు ఉన్నారు.