పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదు..

Missing case registered in police station..నవతెలంగాణ – రెంజల్

మండల కేంద్రమైన రెంజల్ గ్రామానికి చెందిన అనుగు అజయ్ కుమార్ (19) ఈనెల 5వ తారీఖు నుంచి కనబడడం లేదు అని తండ్రి అణుగు శ్రీనివాస్ మంగళవారం రెంజల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఐదున సుమారు తొమ్మిది గంటల 30 నిమిషాలకు ఇంటి నుండి బైక్ పై తన భార్య లావణ్యతో నిజామాబాద్ వెళ్లి వస్తానని వెళ్లి ఇంతవరకు ఆచూకీ లభించలేదని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. తన కుమారుడు ఐటిఐ సెకండియర్ చదువుతున్నాడని, తన మొబైల్ ఫోన్ కు ఫోన్ చేయరా స్విచ్ ఆఫ్ అయ్యిందని ఆయన తెలిపారు. గత వారం రోజులుగా తమ బంధువులు, చుట్టుపక్కల వారి వద్ద ఆరా తీయగా ఇలాంటి ఆచూకీ లభించకపోవడంతో ఈరోజు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడని ఎస్సై ఈ సాయన్న పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.